7న అసెంబ్లీకి టి బిల్లు?: గడువుపై సస్పెన్స్, రాయలటినే

12 జిల్లాల తెలంగాణకే మొగ్గు
విభజన కసరత్తు పూర్తి చేసిన జివోఎం పన్నెండు జిల్లాలతో కూడిన తెలంగాణకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి తెలంగాణకు సూచన చేసినట్లుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో పాలనపై గవర్నర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఏర్పాటుకు ఏకగ్రీవంగా జివోఎం ఆమోద ముద్ర వేశారని సమాచారం. రాయల తెలంగాణ వల్ల కలిగే లాభ నష్టాల గురించి జివోఎం తన నివేదికలో వివరించిందని తెలుస్తోంది.
తెరాస బందుపై సర్వే
రాయల తెలంగాణ అంశం కేవలం ప్రతిపాదన మాత్రమేనని, కేవలం అపోహతోనే తెరాస బంద్‌కు పిలుపునిచ్చిందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ గల తెలంగాణ, ఉమ్మడి రాజధాని అనే మూడు ముచ్చట్లు తప్ప మరేమీ ఉండబోదని చెప్పారు.
గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసెల్ సమావేశానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావ డం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నారని, బిజెపి కూడా దానికే మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications