తెరాస వైపు: టిడిపి నేత తలసాని ఇంటికి కెసిఆర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. తలసాని శ్రీనివాస యాదవ్ సోమవారం తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. తాను ఏర్పాటు చేసిన పలహార పండుగకు రావాలని తలసాని కెసిఆర్‌ను ఆహ్వానించారు.
తనకు ఆహ్వానం అందడంతో కెసిఆర్ సోమవారం సాయంత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. శ్రీనివాస యాదవ్ తెరాసలో చేరుతారానే ఊహాగానాలు చేలరేగుతున్న సమయంలో కెసిఆర్‌తో భేటీకి ప్రాధాన్యం చేకూరింది.

ఆషాఢ మాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసం తొలి వారంలో తలసాని తెరాసలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై, హైదరాబాదులో గవర్నర్ అధికారాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిని ప్రశ్నిస్తూ తలసాని శ్రీనివాస యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
తలసాని శ్రీనివాస యాదవ్‌తో పాటు మరికొంత మంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ శానససభ్యులు, నాయకులు తెరాస వైపు చూస్తున్నట్లు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications