చంద్రబాబుకు ఘోర అవమానం..అధినేత కారుపైకి దూసుకెళ్లిన తెలుగు తమ్ముళ్లు

అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టికెట్ దక్కకపోవడంతో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. ప్రతి జిల్లాలోనూ ఇదే తంతు కనిపిస్తోంది. తాజాగా నాయకుల నిరసన సెగ ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును తాకింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు గట్టి షాకిచ్చారు. గోపాలపురం నియోజకవర్గం టికెట్ విషయంలో టీడీపీ శ్రేణులు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గం సీటును మద్దిపాటి వెంకటరాజుకు కేటాయించడాన్ని మాజీ జెడ్పీ ఛైర్మన్ ముల్లపూడి బాపిరాజు వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వారు పార్టీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TDP activists stopped Chandrababu convoy to protest

దీనిలో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు బాపిరాజు వర్గీయులు తమ నిరసనను తెలియజేశారు. బాపిరాజు వర్గీయులు ఆందోళనకు దిగడంతో నల్లజర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.సుమారు 200 మందికి పైగానే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకుని ఆందోళన చేశారు. ఉదయం నుంచి చంద్రబాబు అపాయింట్‎మెంట్ కోసం బాపిరాజు ఎదురుచూసినప్పటికి ఆయన్ను కలిసిందేకు చంద్రబాబు ఆసక్తి చూపించకపోవడంతో బాపిరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పార్టీ అధినేత ఎదుటే తమ అసంతృప్తిని తెలియజేశారు.

చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకుంటూ కారుపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేసే వారిని చెదరగొట్టారు. ఈ ఘటన తరువాత బాపిరాజును చంద్రబాబు కలిసేందుకు అనుమతి ఇచ్చారు. గోపాలపురం వర్గపోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+