సీఎం జగన్ ఇలాకాలో చంద్రబాబు - కొత్త స్కెచ్, టార్గెట్ ఫిక్స్..!!
ఏపీలో రాజకీయ వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు తీసుకుంటున్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం పైన మాత్రం ఆరోపణల తీవ్రత పెంచింది. ఎన్డీఏలో టీడీపీలో చేరికపైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రాజెక్టు బాట పట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలో కొత్త స్కెచ్ తో రంగంలోకి దిగుతున్నారు.
చంద్రబాబు సీమ యాత్ర:టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీకి పట్టున్న రాయలసీమ ప్రాంతం పైన ఫోకస్ చేసారు. వరుసగా ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి చంద్రబాబు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి (ఆగస్టు 1) ప్రాజెక్టుల సందర్శనకు నిర్ణయించారు. పది రోజుల పాటు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను సందర్శించనున్నారు. పెన్నా నుంచి నాగావళి వరకు వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టు లను పరిశీలించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ప్లాన్ సిద్దమైంది. అందులో భాగంగా ముందుగా నంద్యాల జిల్లా నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. అందులో భాగంగా నందికొట్కూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ లో పాల్గొంటారు.

వైసీపీ కంచుకోటలపై గురి:ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకం, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను సందర్శిస్తారు. ఆగస్టు 2న కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందులలో చంద్రబాబు పర్యటన ఖరారైంది. కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందు వెళ్లనున్న చంద్రబాబు స్థానిక పూలంగళ్ల సర్కిల్ వద్ద రోడ్ షో, బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజవర్గం పైన వైసీపీ నాయకత్వం ప్రత్యేకంగా గురి పెట్టింది. వై నాట్ 175 నినాదంలో కుప్పంలోనూ విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ భరత్ ను అభ్యర్దిగా నిర్ణయించారు. కుప్పం పైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోకస్ చేసారు.

పులివెందులలో చంద్రబాబు సభ:దీనికి కౌంటర్ గా చంద్రబాబు వై నాట్ పులివెందుల అంటూ నినాదం అందుకున్నారు. లోకేశ్ యువగళం యాత్ర జిల్లాలో సక్సెస్ అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా పలువురి నేతలను తమ పార్టీలోకి ఆకర్షించేలా టీడీపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. జిల్లాకు చెందిన కొందరు నేతలు జనసేనతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. వైసీపీకి కంచుకోటలు గా ఉన్న జిల్లాల్లో ఆ పార్టీని ముందుగా దెబ్బ తీయాలనేది చంద్రబాబు వ్యూహం. నెల్లూరు తరువాత ఇప్పుడు కడప, కర్నూలు పైన గురి పెట్టింది. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ పులివెందులలో చంద్రబాబు పర్యటన రోడ్ షో..సభ రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications