చంద్రబాబు భావోద్వేగం

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగాలకు లోనయ్యారు. కేసుల్లో అక్రమంగా ఇరికించారంటూ బాబును వారంతా ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబునాయుడు కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారు. వారికి ధైర్యం చెప్పారు. మనకు అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలన్నారు. తొలుత ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ షేర్ చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై 52 రోజులపాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన ఆయన రోడ్డుమార్గంలో సుమారు 13 గంటలపాటు ప్రయాణించి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అమరావతి రైతులు బాబు కు ఘనస్వాగతం పలికారు. రాజధాని రైతులు గుమ్మడికాయతో చంద్రబాబుకు దిష్టి తీశారు.

tdp chief chandrababu naidu reached undavalli house

ఉదయం ఐదుగంటల సమయం దాటిన తర్వాతే ఉండవల్లిలోని ఇంటికి చంద్రబాబు చేరుకున్నారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె చంద్రబాబుకు దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని గుమ్మడికాయలు కొట్టారు. రాజమండ్రి నుంచి ఉండవల్లికి చేరుకోవడానికి బాబుకు దాదాపు 13 గంటలకుపైగా సమయం పట్టింది. దారిపొడవునా ప్రజలు నీరాజనం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+