బీజేపీ నేతకు గుండెపోటు తెప్పించిన చంద్రబాబు!
అధికార వైసీపీని నిలువరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల సమరాంగణంలోకి దిగారు. వైఎస్ జగన్ ను నిలువరించాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి అని, ఆ పార్టీ మద్దతు తీసుకుంటేనే ఎన్నికల సమయంలో వైసీపీని తట్టుకోగలుగుతామని చంద్రబాబు భావించారు. అయితే ఈ పొత్తు కుదిరే క్రమంలో బీజేపీలో ప్రో వైసీపీ నేతలుగా ఉన్నవారు అడుగడుగునా అడ్డుతగిలారు. వారంతా అధిష్టానికి తరుచుగా ఫిర్యాదులు చేయడంతో వాయిదా పడుతూ.. వాయిదా పడుతూ చివరి నిముషంలో పొత్తు కుదిరింది.
చంద్రబాబుపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసి పొత్తు కుదరకుండా ఉండేందుకు ప్రయత్నించినవారిలో రాజ్యసభ్యుడైన జీవీఎల్ నరసింహారావు ప్రథముడు. మళ్లీ.. ఇదే నేత ఒకవేళ పొత్తు కుదిరితే విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేయాలనే ఉద్దేశంతో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. తాజా విశాఖపట్నం లోక్ సభ స్థానానికి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పేరును ప్రకటించడంతో జీవీఎల్ ఆశలు అడియాసలయ్యాయి.

బీజేపీ పోటీచేసే ఆరు నియోజకవర్గాల్లో జీవీఎల్ ఎక్కడ పోటీచేసినా గెలవడం కష్టమని ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు. ఇలా జీవీఎల్ ను నిలువరించేందుకు చంద్రబాబు ఎత్తుగడను సమర్థవంతంగా అమలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికైన పురంధేశ్వరి నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించారు.
ఇప్పుడు అదే ఆయనకు మైనస్ గా మారింది. జీవీఎల్ ను అడ్డుకోవడంతోపాటు ఎంపీగా పోటీచేసేందుకు భరత్ కు మార్గం సుగమం చేసేందుకు చంద్రబాబుకు పురంధేశ్వరి కూడా సహకరించారంటూ జీవీఎల్ వర్గీయులు ఆరోపిస్తున్నారుకానీ ఆ నేతలు ఈ ఆరోపణలను అసలు పరిగణనలోకి కూడా తీసుకోవడంలేదు.












Click it and Unblock the Notifications