కుర్చీలు కాదు టీడీపీనే మడత పెట్టేశారుగా.. కేశినేని నాని సెటైర్లు..!
ఏపీలో ఎన్నికల వేళ కుర్చీ మడత వ్యాఖ్యల రాజకీయం సాగుతోంది. వచ్చే ఎన్నికల కోసం షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టాలంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుకు కౌంటర్ గా విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు మీ కుర్చీ మడతపెడతారంటూ వ్యాఖ్యానించగా.. ఆయన తనుడు నారా లోకేష్ మరో అడుగు ముందుకేసి ఏకంగా కుర్చీని మడతపెట్టి చూపించారు. ఇప్పుడు వీరిద్దరికీ తాజాగా వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ కుర్చీలు మడతపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేశినేని నాని సలహా ఇచ్చారు. తండ్రీ, కొడుకులు కలిసి కుర్చీ మడత పెట్టడం కాదు ఏకంగా టీడీపీనే మడత పెట్టేశారంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం ఎప్పుడైనా ఊహించారా అని కేశినేని ప్రశ్నించారు. కానీ ఈసారి మాత్రం రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండిపోవడాన్ని తప్పుబట్టారు. టీడీపీకి తెలంగాణలో సున్నా, రాజ్యసభలో సున్నా.. రేపు ఆంధ్రా ఎన్నికల్లో వచ్చేది కూడా సున్నాయేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎద్దేవా చేశారు.

Recommended Video

గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ గత ఎన్నికల తర్వాత నుంచీ అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల వరకూ ఆగి తాజాగా వైసీపీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి చంద్రబాబు, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి టీడీపీ నేతల నుంచీ కౌంటర్లు పడుతున్నాయి. ఎన్నికల్లోపు ఈ వార్ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications