జనసేన- టీడీపీ ఎంపీ అభ్యర్దుల ఖరారు - రఘురామ సీటు ఖరారు..!!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్దుల జాబితాను టీడీపీ దాదాపు ఖరారు చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు రెండు సీట్లు ఇవ్వనున్నారు. మొత్తం 25 స్థానాల్లో 13 స్థానాలకు అభ్యర్దులను చంద్రబాబు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్సాపురం అభ్యర్దిగా పోటీ చేయనున్నారు. కడప సీటు పైన కాంగ్రెస్ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

Recommended Video

    Janasena, TDP MP అభ్యర్థుల పేర్లు.. జనసేనకు ఎన్ని సీట్లు..? | Telugu Oneindia

    జాబితా పై కసరత్తు: టీడీపీ, జనసేన ఎంపీ అభ్యర్దుల జాబితా కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటి వరకు 13 మంది అభ్యర్దులను ఖరారు చేసారు. మిగిలిన అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చినా మరో విడత సర్వే తరువాత ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. నర్సాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ టీడీపీ అభ్యర్దిగా పోటీ చేయనున్నారు. అదే విధంగా వైసీపీ నర్సరావుపేట ఎంపీగా ఉంటూ రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలను తిరిగి అక్కడి నుంచే టీడీపీ బరిలోకి దింపాలని నిర్ణయించింది.

    TDP - Janasena contesting MP Candidates list Almost finalised, names is here

    జనసేనకు కాకినాడ, మచిలీపట్నం స్థానాలు కేటాయించారు. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి తిరిగి పోటీ చేయనున్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి(ఎస్సీ), రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ అభ్యర్దులు పోటీ చేయనున్నారు.

    జనసేనకు రెండు సీట్లు: విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేశ్‌, కంది చంద్రశేఖర్‌ తదితరులు పోటీలో ఉన్నారు. రాజమండ్రి సీటును మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. అమలాపురానికి మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు గంటి హరీశ్‌ పేరు ఖరారైనా.. తాజాగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె పేరు తెర మీదకు వచ్చింది. గుంటూరు నుంచి ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ పేరు రేసులో ఉన్నా స్థానికంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరు వినిపిస్తోంది. ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ మాగుంట తిరిగి టీడీపీలో చేరితే ఆయనకు కేటాయించే ఛాన్స్ ఉంది. నెల్లూరు నుంచి ఆనం లేదా నారాయణ కు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. చిత్తూరు నుంచి తలారి ఆదిత్య పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉంది.

    కడప నిర్ణయం పెండింగ్: అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసినా.. తాజాగా పూల నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కడపలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేశ్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

    ఇక్కడా చివరి వరకూ నిర్ణయం జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్‌ పార్థసారథిలో ఒకరిని ఖాయం చేసే ఛాన్స్ ఉంి. నంద్యాలలో సీనియర్‌ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక, కడపలో కాంగ్రెస్ నుంచి అభ్యర్ది ఖరారైన తరువాత పార్టీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+