జగన్ ఓడిపోయాడే గానీ చావలేదు: పామును చచ్చేంత వరకూ కొట్టాలి
Ayyanna Patrudu: రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందున తెలంగాణకు చెందిన కొందరు అయ్యన్న పాత్రుడి స్నేహితులు, టీడీపీ నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జగన్ గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడే గానీ చావలేదని వ్యాఖ్యానించారు.

వాడు (జగన్) ఓడిపోయాడే గానీ చావలా. అపారమైన ధన బలం ఉంది, కుల బలం ఉంది. పక్క గవర్నమెంట్‌లో ఉంటారు వీడి మనుషులు. మనదేశంలో డబ్బుకు లొంగిపోనివాడు లేడు.. అని అయ్యన్న పాత్రుడి పక్కన కూర్చున్న వ్యక్తి చెప్పడం కనిపించింది. అయితే లెగకుండా కొట్టాలి.. అంటూ అయ్యన్న పాత్రుడు ఆ సంభాషణను కొనసాగించారు. ఈ డైలాగ్ నచ్చింది.. అని చెప్పారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ ఆయన జగన్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్, విజయసాయిరెడ్డిని సైకోలుగా అభివర్ణించారు. వారిని జ్యుడీషియరీ ఎంక్వైరీ వేసి వాళ్లందర్నీ జైలుకు పంపిస్తానని శపథం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగడం, జగన్ తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications