బోడే ప్రసాద్ అల్టిమేటం - నేను పోటీ చేస్తున్నా..!!
టీడీపీ రెండో జాబితా తో రచ్చ మొదలైంది. పలు నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి మద్దతు దారులు నిరసనలకు దిగారు. 34 మందితో చంద్రబాబు రెండో జాబితా ప్రకటించారు. ఇటు జనసేనాని పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసారు. దీంతో..పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పెనమలూరులో బోడే ప్రసాద్ కు సీటు లేదని పార్టీ సమాచారం ఇచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై కార్యకర్తలు మండిపడుతున్నారు.
టీడీపీ శ్రేణుల ఆందోళనలు
టీడీపీ రెండో జాబితా విడుదలతో పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ పోటీ చేసే పిఠాపురంలో టీడీపీ శ్రేణుల నిరసనలు తారా స్థాయికి చేరాయి. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ వర్మ రేపు తన మద్దతు దారులతో సమావేశం కానున్నారు. స్వతంత్రంగా బరిలో నిలవాలని ఆయన మద్దతు దారులు ఒత్తడి చేస్తున్నారు.

దీని పైన రేపు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇటు కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ కు సీటు దక్కలేదు. తనకు సీటు ఇవ్వకపోయినా..తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక, పెనమలూరులో పార్టీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్ కు సీటు లేదని టీడీపీ నాయకత్వం సమాచారం ఇచ్చింది.
బోడే ప్రసాద్ వర్గం ఆందోళన
దీని పైన బోడే ప్రసాద్ వర్గం నిరసనలకు దిగింది. బోడేకు సీటు ఇవ్వాలని నినదించింది. దీని పైన బోడే ప్రసాద్ స్పందించారు. తాను నియోజకవర్గంలో పార్టీ కోసం చేసిన కష్టాన్ని వివరించారు. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. పెనమలూరు నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీ చేస్తే సహకరిస్తానని స్పష్టం చేసారు.
బయట వ్యక్తులు పోటీ చేస్తే తాను చంద్రబాబు ఫొటోతోనే ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు. సీటు ప్రకటించే వరకు తనకు అవకాశం దక్కుతుందనే వేచి చూస్తానని చెప్పారు. తనకు చంద్రబాబు మాటగా పార్టీ ముఖ్యులు సీటు లేని విషయం చెప్పటంతో తన గుండెలు పిండేసేలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసారు.

పెనమలూరు దక్కేదెవరికి
తాను ఏనాడు సొంతం కోసం ఆలోచన చేయకుండా పార్టీ కోసమే పని చేసానని చెప్పుకొచ్చారు. పెనమలూరు నుంచి కొత్త అభ్యర్దిని రంగంలో దించేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే పలువురి పేర్ల పైన సర్వే చేయించారు. అందులో బోడే ప్రసాద్ పేరు ఉంది. కానీ, తనకు ఏ కారణంతో సీటు ఇవ్వటం లేదో చెప్పాలని బోడే ప్రశ్నిస్తున్నారు.
బోడేకు సీటు లేదని తెలిసి పార్టీ కార్యకర్త పార్టీ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. టీడీపీ ఇంకా 16 నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. పెనమలూరుకు మూడో జాబితాలో ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో, పెనమలూరు అభ్యర్ది ఎవరవుతారు..బోడే ప్రసాద్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications