మళ్లీ తెరపైకి శాంతి..! సెటిల్మెంట్ పేరుతో సాయిరెడ్డిని టార్గెట్ చేసిన బుద్దా..!
ఏపీలో టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బుద్ధా వెంకన్న, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డికీ మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. కొంతకాలంగా సాయిరెడ్డి విషయంలో సైలెంట్ గా ఉంటున్న బుద్దా వెంకన్న మళ్లీ ఇవాళ రెచ్చిపోయారు. సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. ఇందులో ముఖ్యంగా గతంలో తలెత్తిన దేవాదాయశాఖ ఉప కమిషనర్ శాంతి వ్యవహారం కూడా ఉంది.
ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డి మళ్లీ విమర్శలు మొదలుపెట్టారని, అందుకే తాను స్పందిస్తున్నట్లు బుద్దా వెంకన్న తెలిపారు. జగన్ కు పాఠాలు నేర్పే ఆర్ధిక నేరస్తుడు విజయసాయి వల్ల వైసీపీ రెండు సీట్లకే పరిమితం అయిందని బుద్ధా విమర్శించారు. శాంతి వ్యవహారంలో ప్రస్టేషన్ లో ఉన్నాడని తామూ వదిలేశామని బుద్దా తెలిపారు. మళ్లీ ఇటీవల మళ్లీ తెగ వాగుతున్నాడంటూ బుద్ధా వ్యాఖ్యానించారు.

శాంతితో డీల్ కుదిరి ఉంటుందని, అందుకే ఇప్పుడు నోరు పారేసుకుంటున్నారంటూ సాయిరెడ్డిపై బుద్దా తీవ్ర విమర్శలు చేశారు. గతంలో శాంతి భర్త నీ మీద చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతావంటూ ప్రశ్నించారు. ఆయన చెప్పిన అంశాలనే మీడియా కూడా రాసింది కదా అన్నారు. మంద కృష్ణమాదిగ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సాయిరెడ్డి ఎక్స్ లో పోస్టు పెట్టారని, కూటమిలో చిచ్చు పెట్టాలని వైసీపీ నేతలు తెగ తాపత్రయ పడుతున్నారని బుద్దా ఆరోపించారు.
2027లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని విజయసాయిరెడ్డి కలలు గంటున్నారని బుద్దా విమర్శించారు. జమిలి ఎన్నికలపై ఇంకా చట్టం చేయలేదని, పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలని గుర్తుచేశారు. కేవలం ప్రతిపాదనల దశలో ఉండగానే విజయసాయిరెడ్డి పగటి కలలుగంటున్నాడన్నారు. వైసీపీ లో పెరిగిన వలసలు ఆపేందుకే విజయసాయిరెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడన్నారు. జగన్ ఇక్కడ అధికారంలోకి రాడు, కలలు కనడం మానుకో అన్నారు. షర్మిల చీర గురించి మాట్లాడిన నిన్ను ఇంకా పార్టీలో ఉంచిన వైసీపీ నాయకులకు బుద్ది ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications