లోకేశ్ యువగళంలో కీలక ఘట్టం, వివాదం - అదే అసలు లక్ష్యం..!!

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం కీలక దశకు చేరుకుండి. టీడీపీకి కంచుకోటగా పేరున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ యాత్ర ప్రవేశిస్తోంది. అయిదు రోజుల పాటు జిల్లాలో యాత్ర కొనసాగనుంది. ఇంత తక్కువ సమయానికే యాత్ర కుదించటం వెనుక అనేక కారణాలు చర్చలో ఉన్నాయి. ఇటు లోకేశ్ యాత్ర సమయంలో ఫ్లెక్సీల తొలిగింపు పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్రలో లోకేశ్ ప్రధానంగా గన్నవరం పైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.

కృష్ణా జిల్లాలో నేటి నుంచి: నారా లోకేశ్ యువగళం యాత్ర కృష్ణా జిల్లాలో నేటి నుంచి ప్రారంభమై 23న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. విజయవాడ నగరంతో పాటుగా గన్నవరం పైనే ఈ యాత్రలో ప్రధానంగా ఫోకస్ కనిపిస్తోంది. వైసీపీ నుంచి చేరికలు ఉంటాయని చెబుతున్నారు. పాదయాత్ర నిర్వహణ పైన కమిటీలు ఏర్పాటు చేసారు. సీనియర్ నేత కేశినేని శివనాధ్ (చిన్ని)కి బాధ్యతలు అప్పగించారు. విజయవాడ నగరంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేసారు.

TDP Leader Nara Lokesh Yuvaglam Padayatra to enter in Vijayawada, Focus on Gannavaram

అయితే, అధికార పార్టీ నేతలు లోకేశ్ యాత్రకు ఆటంకాలు కలిగిస్తున్నారని చిన్ని ఆరోపించారు. సభ ఏర్పాటుకు స్థలం ఇవ్వకుండా యజమానులను బెదిరించారని విమర్శించారు. ఏర్పాట్లలో భాగంగా నగరంలోఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను తొలగించాలని మునిసిపల్ కమిషనర్ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయిదు రోజుల యాత్ర: లోకేశ్ ఫ్లెక్సీలు తొలిగించటం సరి కాదన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా పాదయాత్ర విజయవంతం చేస్తామని..ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగదని చిన్ని స్పష్టం చేసారు. లోకేశ్ యాత్ర నగరం లోని పశ్చిమ నియోజకవర్గంలోని ప్రవేశించగానే ఆర్యవైశ్యులతో సమావేశం అవుతారు. హమాలీ, విద్యుత్ కార్మికులతో మాట్లాడుతారు.

సెంట్రల్ లో ఆటో కార్మికులు, పుస్తక పబ్లిషర్లు, ఆర్ఎంపీలతో భేటీ కానున్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో బస చేస్తారు. నిడమానూరు, గన్నవరం లో వివధ వర్గాలతో ముఖాముఖి సమావేశం కానున్నారు. అయిదో రోజు గన్నవరం నుంచి బయల్దేరి అగిరిపల్లిలోకి ప్రవేశిస్తారు.

TDP Leader Nara Lokesh Yuvaglam Padayatra to enter in Vijayawada, Focus on Gannavaram

గన్నవరం పై గురి: గన్నవరంలో బహిరంగ సభలో లోకేశ్ పాల్గొంటారు. ఈ సభ సక్సెస్ చేసేందుకు ప్రతీ మండలానికి పార్టీ ఒక ఇంఛార్జ్ ను నియమించింది. ఇప్పుడు గన్నవరం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. గతంలో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన దాసరి బాలవర్దన రావు తాజాగా చంద్రబాబుతో సమావేశమయ్యారు.

వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ఇప్పుడు చంద్రబాబును కలుస్తానని ప్రకటించారు. సీటు ఇస్తే గన్నవరం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తొలి నుంచి వల్లభనేని వంశీని ఓడించాలనేది టీడీపీ అధినాయకత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ గన్నవరం లో యాత్ర..సభ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+