మేం చేతులు కట్టుకొని కూర్చుంటామా?

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు కట్టుకొని కూర్చుంటామని ఎలా అనుకుంటారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె సోదరుడు.. ఎంపీ రామ్మోహన్ నాయుడును కలిసి సంఘీభావం తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిత వైసీపీ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలవల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా? అని డిబేట్ పెడితే మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే క్యూ కడతారన్నారు.

టీడీపీ నాయకుల మీద అవినీతి మరక అంటించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, మహా అయితే జైలులో పెట్టించగలరని.. అంతకన్నా ఇంకేమీ చేయలేరన్నారు. కేసు అంటే కిరీటం లాంటిదని, రత్నం, వజ్రంలా తాము భావిస్తున్నామన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసులతో ములాఖత్ అయ్యేందుకు తమ నేత చంద్రబాబు వస్తే పర్మిషన్ ఇచ్చారని సూపరింటెండెంట్ ను బదిలీ చేశారని అనిత ఆరోపించారు. 30 సంవత్సరాలుగా వ్యాపారంలో, ప్రజా జీవితంలో ఉన్నవారిపై ఎవరికీ కనపడని మచ్చలు ఈ ప్రభుత్వానికే కనపడుతున్నాయన్నారు.

ysrcp-tdp

ఆదిరెడ్డి కుటుంబం చేస్తున్న వ్యాపారంపై ఎవరూ పోలీసులకుకానీ, సీఐడీవారికికానీ ఫిర్యాదు చేయలేదని, కనీసం సుమోటాగా తీసుకునేందుకు ఏ పత్రికలోను, టీవీలోను రాలేదన్నారు. కక్షగట్టి సీఐడీ పోలీసులను పంపించి అరెస్ట్ లు చేయిస్తున్నారని, అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు అంత బదులు తీర్చుకుంటామని, చేతులు కట్టుకొని కూర్చుంటామని అసలు ఎక్స్ పెక్ట్ చేయొద్దని వ్యాఖ్యానించారు.

 anitha

ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసు(వాసు) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు రిజర్వు చేసింది. దర్యాప్తు పూర్తికాలేదని, నిందితులు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ తరఫున న్యాయవాది కోర్టులో వాదించారు. బెయిల్ పై వారు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు. ఇరుపక్షాల తరఫున వాదనలు విన్న జస్టిస్ సురేష్ రెడ్డి తన తీర్పును రిజర్వు చేశారు. బెయిల్ మంజూరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+