జగన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్న టీడీపీ

Chandrababu Naidu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్‌ను నింపాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లను సాధించింది ఈ రెండు చోట్ల కూడా.

ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. 2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ.

TDP leaders hoisted the Party s flag at Rishikonda building in Visakhapatnam

ఈ పరిణామాల మధ్య- జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్మించిన పర్యాటక భవన సముదాయాన్ని తెలుగుదేశం పార్టీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తాను మరోసారి అధికారంలోకి వస్తే- ఈ భవన సముదాయం నుంచే పరిపాలన సాగిస్తానంటూ గతంలో వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అందులోనే జగన్.. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయం కూడా నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భవనాన్ని తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీనిపై పసుపు జెండా ఎగిరింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ భవనం వద్దకు వచ్చారు.

అందులోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవి ఫలించలేదు. నేరుగా భవన సముదాయం పైకి వెళ్లిన టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+