ఆ ''సర్వే''ను నమ్ముకుంటే టీడీపీ కొంప కొల్లేరే

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది. ఎన్నికల తేదీపై రాజకీయ పార్టీలన్నీ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఏపీ రాజకీయాలను ఓసారి పరిశీలిస్తే.. టీడీపీ, జనసేనతో బీజేపీ చేతులు కలిపిన తరువాత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ఇప్పటికే పలు సర్వేలు తమ నివేదికను వెల్లడించాయి.

మెజార్టీ సర్వేలు అధికారం వైసీపీదే అధికారమని తేల్చేశాయి. కూటమిలో బీజేపీ చేరిన తరువాత చేసిన సర్వేల్లో కూడా ఇవే ఫలితాలు ఉత్పన్నం అవుతాయని పలు సర్వేలు ప్రకటించాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఒకటి, రెండు సర్వేలు చెప్పడం జరిగింది. వాటిలో ''సీ - ఓటర్ సర్వే'' ఒకటి. ఏపీలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని 'సీ - ఓటర్'' సంస్థ ఇటీవల ప్రకటించింది.

TDP leaders NOT TRUSTED ON that survey

అయితే ఇప్పుడు ఆ సర్వే గురించి రాష్ట్రంలో, ముఖ్యంగా టీడీపీ పార్టీలో విపరీతమైన చర్చ సాగుతోంది. ఎందుకుంటే ఈ సంస్థ గతంలో చేసిన సర్వేలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. 2023లో ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 53 వరకు సీట్లు వస్తాయని ''సీ - ఓటర్'' సంస్థ ప్రకటించింది. కానీ చివరికి 35 సీట్లు మాత్రమే దక్కించుకుంది. 54 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 133 స్థానాలు వస్తాయని 'సీ- ఓటర్'' సంస్థ ప్రకటించింది.

కానీ చివరికి ఆ పార్టీకి 66 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతిమంగా బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఇక గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి 100 అసెంబ్లీ సీట్లు వస్తాయని, 14 పార్లమెంటు స్థానాలు దక్కుతాయని ''సీ - ఓటర్ సర్వే'' ప్రకటించింది. చివరికి మూడు ఎంపీలు, 23 ఎమ్మెల్యే సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో సీ - ఓటర్ సర్వే సామర్థ్యం ఎంత? దానికి ఉన్న విశ్వసనీయత ఎంత? అనే దానిపై టీడీపీ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది.

సీ - ఓటర్ సర్వే నమ్ముకుని ముందుకు వెళ్తే టీడీపీ నిండా మునిగిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో టీడీపీ నాయకులు తీవ్ర నిరాశలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టి చేసేదే నిజమైన సర్వే. దానికే విశ్వసనీయత ఉంటుంది.అలా కాకుండా ఓ పార్టీకి అనుకూలంగా సర్వే చేసి.. నివేదిక ఇస్తే.. దాన్ని విశ్వసించే స్థితిలో ప్రజలు లేరని సర్వే సంస్థలు గుర్తుంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+