రోజా 'మగాళ్ల' వ్యాఖ్య: దుమ్మెత్తిపోస్తున్న టిడిపి నేతలు
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరు కాబట్టే తమ పార్టీ శాసనసభ్యులను తీసుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు అదే స్థాయి మండిపడుతున్నారు.
మంగళవారంనాడు టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు రోజాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో మగాళ్లున్నారో లేరో రోజాకు బాగా తెలుసునని బొండా ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు.
గతంలో టిడిపిలో ఉన్న రోజాకు తమ పార్టీలో మగాళ్లు ఉన్నారో లేరో బాగా తెలుసునని చెప్పారు. రోజా వేధింపులను తాళలేకపోతున్నామని వైసిపి ఎమ్మెల్యేలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

టిడిపిలో మగాళ్లు లేరని రోజా అంటున్నారని, రోజా ఏమైనా టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారా అని గాలి ముద్దుకృష్ణ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆడ - మగ తేడా లేదని, అందరూ సమానమేనని సూచించారు. రోజా ఎక్కడ ఉన్నా ఆమెది ఐరన్ లెగ్ అన్నారు.
తాజాగా బుధవారంనాడు టిడిపి నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి నెల్లూరులో రోజా వ్యాఖ్యలపై స్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మగరాయుళ్లు ఉంటే టీడీపీలో ప్రజలకోసం కష్టపడే మహిళా నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారని వ్యాఖ్యానించారు.
రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషిచేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు ఆశీస్సులు ఉన్నాయని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అన్నారు. జగన్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ మధ్య తేడా తెలియదని ఎద్దేవాచేశారు.












Click it and Unblock the Notifications