వచ్చి చూసుకొని మాట్లాడు!: పవన్ కళ్యాణ్‌కు టిడిపి దమ్కీ, జగన్‌పై..

గుంటూరు/విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు, ఏపీ మంత్రులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాజధాని భూసేకరణ చట్టాన్ని పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు పలువురు టిడిపి నేతలు, మంత్రులు స్పందించారు. మంత్రులు నారాయణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ప్రశ్నల వర్షం కురిపించారు.

పవన్‌తో సహా ఎవరు వచ్చినా: నారాయణ

రాజధాని ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌తో సహా ఎవరు పర్యటనకు వచ్చినా తాము సహకరిస్తామని, వచ్చి చూసుకోవచ్చునని మంత్రి నారాయణ చెప్పారు. సలహాలు, సూచనలు ఇస్తే పరిశీలిస్తామన్నారు. 92 శాతం మంది రైతులు భూమిని ఇచ్చారన్నారు.

TDP leaders target Pawan Kalyan

కొంతమంది మాత్రమే రాజధాని పైన రాద్దాంతం చేస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతానికి వచ్చి మెజార్టీ రైతుల అభిప్రాయం తెలుసుకోవచ్చునని చెప్పారు.

బంద్ ఆపండి, పవన్ వచ్చి చూడాలి: సోమిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని భూమి విషయంలో బంద్ ఆపేయాలని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

నెలలో నాలుగు రోజులు బంద్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు పాడు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత భూమి పైన అధ్యయనం చేసిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టే పని తమ ప్రభుత్వం చేయదని చెప్పారు.

నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం: కలెక్టర్

రాజధాని ప్రాంతంలో తొలి విడత భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఐదు గ్రామాల పరిధిలో 11.04 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తుళ్లూరు2లో 4.28, బోరుపాలెంలో 0.83, అనంతవరంలో 4.26 ఎకరాల చొప్పున సేకరిస్తామన్నారు. మిగతా భూమిని పిచుకలపాలెం, అబ్బురాజుపాలెంలలో సేకరిస్తారు.

రాజధాని అనుకూల రైతుల ఆందోళన

రాజధానికి భూములు ఇచ్చి, భూములు ఇవ్వాలని పలువురు రైతులు మంగళగిరి అంబేడ్కర్ కూడలిలో ఆందోళన చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా అందరూ భూములు ఇవ్వాలని, రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+