ఆ ఇద్దరి ఎత్తులతో "భూమా" చిత్తు - రెండు సీట్లు లేనట్లేనా..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీల అభ్యర్దుల లెక్కలు మారుతున్నాయి. ఎన్నికల జంపింగ్స్ మొదలయ్యాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఆశావాహులు అలర్ట్ అవుతున్నారు. బీజేపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ నుంచి మెజార్టీ సీట్లు సిట్టింగ్ లకే దక్కే అవకాశం ఉంది. దీంతో, టీడీపీ నుంచి సీటు రాదని భావిస్తున్న వారు జనసేన నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో, టీడీపీ సీనియర్లకు షాక్ తప్పటం లేదు. ఇప్పుడు ఇదే భూమా కుటుంబానికి టికెట్ల విషయంలో సందేహానికి కారణమవుతోంది.
మారుతున్న సమీకరణలు
కర్నూలు జిల్లా నంద్యాల సీటు మాజీ మంత్రి ఫరూక్ కు టీడీపీ సీటు ఖాయం చేసింది. ఇప్పుడు ఇదే భూమా కుటుంబంలో..నియోజకవర్గంలో సంచనలంగా మారింది. ఈ సీటు పంచాయితీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. 2017 ఉప ఎన్నికల్లో.. భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు.

2019 ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ కేటాయించినా.. ఓడిపోయారు. ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. పార్టీలో మైనారిటీ వర్గాల ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి ఫరూక్ కు సీటు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వహీద్‌కు.. కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, భూమా కుటుంబానికి నంద్యాల సీటు ఇక లేదనే ప్రచారం సాగుతోంది.
భూమా కుటుంబానికి సీట్లు ఉంటాయా
ఇటు టీడీపీ - జనసేన పొత్తు ఖయమైన నేపథ్యంలో తాజాగా ఇరిగెల రాంపుల్లారెడ్డి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండటంతో ఇరిగెల రాంపుల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు ప్రకటించారు.
భూమా నాగిరెడ్డి 2008లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆ స్థానంలో రాంపుల్లారెడ్డిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు సమక్షంలో 2009లో టీడీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేశారు. 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఇరిగెల సోదరులు పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు జనసేనలో చేరే సమయంలోనే టికెట్ పైన హామీ పొందారని ప్రచారం సాగుతోంది.

పొత్తుల వేళ కొత్త లెక్కలు
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డికి తిరిగి సీటు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తనకు సీటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే, నియోజకవర్గంలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు..వరుస కేసులు...వివాదాలతో భూమా అఖిల ప్రియకు సీటు ఇస్తారా లేదా ..ఇచ్చినా పార్టీ కేడర్ సహకరిస్తుందా అనే చర్చ మొదలైంది.
దీంతో, అఖిలకు టీడీపీ నుంచి సీటు రాకుంటే పవన్ తో ఉన్న పరిచయంతో ఆ పార్టీ నుంచి సీటు దక్కించుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు జనసేనలోకి రాంపుల్లారెడ్డి చేరటంతో అఖిల సీటు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ రెండు సీట్ల విషయంలోనూ భూమా ఫ్యామిలీకి సీటు విషయం పై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో, చంద్రబాబు - పవన్ సీట్ల ఖరారు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications