వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీచ్ ఫెస్టివల్: అజ్ఞాతంలోకి వెళ్లిన టిడిపి ఎమ్మెల్యే అనంతలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: అధికారుల తీరుపై కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి మరోసారి అలక వహించారు.అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికే అలక మీదున్న ఆమె మరోసారి తన నిరసనను వ్యక్తం చేశారు.

Recommended Video

Ys Jagan implementing tdp strategy

తనను అవమానించేలా అధికారులు వ్యవహరించారని బీచ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త, రూరల్‌ ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

 పరాభవం జరిగిందని అలక...

పరాభవం జరిగిందని అలక...

తనకు పరాభవం జరిగిందని అలక వహించి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా మంత్రులు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వారికి కూడా ఆమె అందుబాటులోకి రాలేదు.

 భర్తను వేదికపైకి పిలవలేదని..

భర్తను వేదికపైకి పిలవలేదని..

నిరుడు జరిగిన బీచ్‌ ఫెస్టివల్‌లో రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వ్యతిరేకతను ఎదుర్కున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పిలిచి ఆమె భర్త సత్తిబాబును పిలవలేదు. దీంత కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక వద్ద ఆందోళనకు దిగారు. వేదిక దిగిరావాలని వారు డిమాండ్ చేశారు.

భర్త హోదాలో పిలువాలా..

భర్త హోదాలో పిలువాలా..

బీచ్ ఫెస్టివల్అధికారిక కార్యక్రమం. ఏ పదవిలోనూ లేని పిల్లి సత్తిబాబును వేదికపైకి పిలవాల్సిన అవసరం లేదు. అయితే ఎమ్మెల్యే భర్త అన్న హోదాలో పిలవాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. అయినా, పరిస్థితి అదుపు తప్పే స్థితిలో ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పిల్లి సత్తిబాబును వేదికపైకి పిలిచారు.

 పట్టించుకోలేదని ఆమె ఆవేదన..

పట్టించుకోలేదని ఆమె ఆవేదన..

బీచ్‌ ఫెస్టివల్‌ ఏర్పాట్ల నుంచి ప్రారంభోత్సవం వరకు తనను పట్టించుకోలేదని పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు అలక వహించారు.వారిని అధికారులు పట్టించుకోలేదు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, పూర్తిగా అధికారిక కార్యక్రమమని అధికారులు ఏర్పాట్లు చేశారు. దాంతో అనంతలక్ష్మికి ఆగ్రహం వచ్చింది.

English summary
Telugu Desam Pary Kakinada rural MLA Pilli Anantha Lakshmi went into under ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X