Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకు ఝలక్: ఫిరాయింపులపై టీడీపీ ఎమ్మెల్సీ కరణం ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయట పడ్డాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య విభేదాలు అందరికీ తెలిసిన అంశాలే.

బుధవారం కనిగిరిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ కరణం బలరాం మండిపడ్డారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. 30 ఏళ్లుగా జెండాలు మోసిన వారికి మొండి చేయి చూపారని మంత్రులు పరిటాల సునీత, శిద్దాల రాఘవరావులపై కరణం బలరాం మండిపడ్డారు.

'ప్రస్తుత జనరేషన్‌లో పబ్బం గడుపుకుపోయే కుహనా నాయకులు కొందరు తయారయ్యారు. అలాంటి వారివల్ల పార్టీ పుట్టినప్పటి నుంచి నిబద్ధతతో పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోంది. అలాంటి నేతలతో వచ్చే సమస్యల్ని పరిష్కరించి.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేదికపైన ఉన్నవాళ్లందరిదీ. కార్యకర్తలను ఆశ్రద్ధ చేసి, వారిని ఇబ్బంది పెట్టి.. ఏమైనా తేడాలు తీసుకొస్తే.. దాని ఫలితం వేరేవిధంగా ఉంటుంది' అని మండిపడ్డారు. తాము పార్టీలో ఉండాలా? వదిలిపోవాలా? ఏదో ఒకటి తేల్చాలని ఆల్టిమేటం జారీ చేశారు. ఇది తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంంద్రబాబు నాయుడికి ఝలక్ ఇవ్వడమేనని భావిసస్తున్నారు.

 TDP MLC fires on Ministers Sunitha and Raghava Rao?

కరణంకు ఇలా మంత్రుల బుజ్జగింపు

Recommended Video

    Chandrababu Naidu Survey Report on Ministers

    సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత స్పష్టతనిస్తామని కరణం బలరాంను మంత్రులు సునీత, రాఘవరావు బుజ్జగించారు. 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసిన వారిని కాదని అభివృద్ధి పనులు సైతం పార్టీకి ఓట్లేయని వారికే కట్టబెడుతున్నారని, పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ కరణం బలరాం ఫైర్‌ అయ్యారు. ఇలా అయితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావులపై బలరాం విరుచుకుపడ్డారు. 'ఎన్ని రోజులని నాన్చుతారు. ప్రోటోకాల్‌ అంటూ మమ్మల్ని కట్టడి చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    'మేం మంజూరు చేయించిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తున్నారు. మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు. తన వైపు రావాలంటూ అల్టీమేటం జారీ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఊరుకోవాలా.. జిల్లా మొత్తంగా పాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. తప్పుడు నిర్ణయాలతో పార్టీని భ్రష్ఠు పట్టించారంటూ బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒకటి చెప్పండి' అని మంత్రులను నిలదీశారు. పార్టీ కోసం పని చేసిన వారి రేషన్‌ షాపులను సైతం బలవంతంగా తొలగిస్తున్నారని చెప్పారు. పార్టీకి ఓట్లేసిన పాపానికి కార్యకర్తలకు శిక్షా.. అంటూ ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకపోతే అమీతుమీ తేల్చుకుంటామంటూ చిందులు తొక్కారు. టీడీపీకి ఓట్లేయని వారికి పథకాలు మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఒకటో తేదీన సీఎం చంద్రబాబుతో భేటీకి మంత్రుల ముహూర్తం

    'పరిస్థితి ఇలాగే ఉంటే మా దారి మేం చూసుకుంటాం' అని కరణం బలరాం ధ్వజమెత్తారు. ఆగస్టు ఒకటోతేదీన సీఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రులు బలరాంకు చెప్పారు. ఈ సమావేశంలో క్లారిటీ వస్తుందని, మీతో ముఖ్యమంత్రి మాట్లాడతారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తొందరపడాల్సిన పని లేదని అన్ని సర్దుకుంటాయని మంత్రులు బలరాంను శాంతింపజేసే ప్రయత్నానికి దిగారు. మూడేళ్లుగా ఇదే చెబుతున్నారని, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని బలరాం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

    ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అద్దంకితో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన పాత నేతలు, కార్యకర్తలు కొత్త వారితో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తెచ్చారు. త్వరలో అన్ని సర్దుకుంటాయని టీడీపీ శ్రేణులకు మంత్రులు పరిటాల సునీత, శిద్ధా రాఘవరావు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

    కనిగిరిలో బుధవారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంతర్వాత స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు నివాసంలో జరిగిన అంతర్గత సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాకుండానే వెళ్లిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. మంత్రులతో బలరాం వాదనకు దిగగానే ఎమ్మెల్సీ కూడా తనకు ఏదో పని ఉందని చెప్పి వెళ్లిపోవడం గమనార్హం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+