వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేవీపీ హోదా బిల్లు: రాజ్యసభలో లేని చిరంజీవి, 'సీఎం' ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుపై ఈ రోజు చర్చ జరిగిన సమయంలో సభలో చిరంజీవి, ఇతర కాంగ్రెస్ సభ్యులు కొందరు లేరని టిడిపి ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు.

హోదాపై చివర్లో ట్విస్ట్, రాజ్యసభలో గందరగోళం: కురియన్ 'జైట్లీ' మెలిక

ప్రయివేటు బిల్లు పైన రాజ్యసభలో ఓటింగ్ ఉంటుందని తాము భావించామని చెప్పారు. కానీ ఓటింగ్ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు ద్రవ్య బిల్లా, కాదా అనే చర్చ ఈ రోజు రాజ్యసభలో జరిగిందని చెప్పారు.

TDP MPs drags Chiranjeevi into Special Status issue

ఏపీకి 6 హామీలిచ్చా, జైట్లీ అక్కడే ఉన్నారు: మన్మోహన్, కేవీపీ ఆగ్రహం

కొంతకాలం ఏపీ ఇబ్బంది భరించాల్సిందే: సుజన

కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధి లేదన్నారు. ఓటింగుకు అవకాశమున్నా ఆ రెండు పార్టీలు ఒత్తిడి చేయలేదన్నారు. మేం మాత్రం సభలోనే ఉన్నామని చెప్పారు. వచ్చే వారంలోగా పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బిల్లు తప్పుల తడకగా ఉండటం వల్లే ఈ సమస్యలు వచ్చాయన్నారు. అంతటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.

ఏపీకి న్యాయం చేసేందుకు కేంద్రంలోని అన్ని విభాగాలతో ప్రధాని నరేంద్ర మోడీ సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. రాజ్యసభలో కేవీపీ బిల్లును మనీ బిల్లుగా పంపించారన్నారు. ఇబ్బందులను ఏపీ ప్రజలు కొంతకాలం భరించక తప్పదన్నారు. రాష్ట్ర ఇబ్బందులను చంద్రబాబు పరిష్కరిస్తారన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు.

English summary
TDP MPs drags Chiranjeevi into Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X