ఆ నలుగురిపై అనర్హత వేటు వేయండి-స్పీకర్ కు నోటీసు ఇవ్వనున్న టీడీపీ.. !
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తెరపైకి వస్తోంది. ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ లోకి ఫిరాయించే సంస్కృతిని మారుస్తామంటూ గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తీసుకోవడంపై టీడీపీ ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేసి ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. అలాగే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఒక్కో ఎమ్మల్యే వైసీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయాయని కోరుతూ వైసీపీ నేతలు తాజాగా అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుతో టీడీపీ కూడా అప్రమత్తమైంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎన్నికలకు ముందు వేటు వేయించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్, మండలి ఛైర్మన్ కు అనర్హత వేటు కోరుతూ ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా తమ పార్టీ నుంచి గతంలో వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, కరణం బలరాంకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.
అదే జరిగితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఏకపక్షంగా కేవలం టీడీపీలోకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలపై మాత్రమే వేటు వేసే అవకాశం ఉండదు. వేటు వేయాలనుకుంటే వైసీపీలోకి ఫిరాయించిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పైనా వేటు వేయాల్సిన పరిస్ధితి వస్తుంది.












Click it and Unblock the Notifications