శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ప్రజా గర్జనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై నిప్పులు చెరిగారు. అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే అన్నం పెట్టి పేదల ఆకలి తీరుస్తానని చెప్పారు. ఎన్నికలో మరో స్వతంత్ర సంగ్రామమన్నారు.

తనకు సంఖ్యాబలం ఇస్తే సత్తా చాటుతానని, తెలుగు జాతి తడాఖా చూపిస్తానని, ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని వ్యాఖ్యానించారు. కెసిఆర్ వసూల్ రాజా అయితే, జగన్ సైకో అన్నారు. కిరణ్ గురించి మాట్లాడటం వృథా అన్నారు. ఆ మూడు పార్టీలకు ఓటేస్తే కాంగ్రెసుకు వేసినట్లే అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా ప్రతి కార్యకర్త ఒక కొండవీటి సింహం, బొబ్బిలిపులిలా విజృంభించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన ప్రజాగర్జనలో బాబు ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఎందరో మహనీయులు పుట్టిన సిక్కోలు గడ్డపై అవినీతి అనకొండలు వెలసి జిల్లా కీర్తి ప్రతిష్ఠలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. చంద్రబాబు సీమాంధ్రలోను తెరాస, ఆ పార్టీ అధినేత కెసిఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిడుగురామ్మూర్తి, గరిమెళ్ల సత్యనారాయణ, కోడిరామ్మూర్తి, సర్దార్ గౌతులచ్చన్న లాంటి మహనీయులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ జిల్లాకు వారు చేసిన సేవలను ప్రస్తుతించారు. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతమని అభివర్ణించారు. ఈ జిల్లా ప్రజలు శాంతికాముకులని పేర్కొంటూ అటువంటి జిల్లాలో గంజాయి మొక్కలు పుట్టాయని ధ్వజమెత్తారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని దుయ్యబట్టారు. పట్టణంలోని విలువైన స్థలాల నుంచి , కన్నెధార కొండ వరకు దోచుకున్నారని నిప్పులు చెరిగారు. అటువంటి వారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

తొమ్మిదిన్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లాకు ఒరిగిందేమి లేదని బాబు ధ్వజమెత్తారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా రూపురేఖలను మారుస్తానని హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. ఈ జిల్లాను దత్తత తీసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

దివంగత ఎర్రన్నాయుడిని చంద్రబాబు పదేపదే స్మరించుకున్నారు. ఆయనలేని లోటును కుమారుడు రామ్మోహన్‌నాయుడు భర్తీ చేస్తున్నారని భుజం తట్టి ప్రశంసించారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

ఎర్రన్నాయుడు కుటుంబానికి అన్నివిధాలుగా తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటూ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని అశేష జనవాహిని కేరింతల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆయన వరాల వర్షం కురిపించారు. అధిక సంఖ్యలో ఉన్న కళింగ వైశ్యులను బిసిల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారుల్లో ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గౌరవిస్తామన్నారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

తీర ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు. ఇందులో భాగంగానే కళింగపట్నం, బారువలో హార్బర్లు నిర్మిస్తామని ప్రకటించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఆధునికీకరించి పూర్తిస్థాయిలో నీరందేలా చర్యలు చేపడతానన్నారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి తనకు అప్పగించాలని కోరారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

గతమెంతో ఘనమైన సిక్కోలు జిల్లా కాంగ్రెస్ పాలనలో అథమస్థాయికి దిగజారిందని నిప్పులు చెరిగారు. ప్రజా ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలకే ఇక్కడి పాలకులు పెద్దపీట వేశారని దుమ్మెత్తి పోశారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అభివృద్ధి ముసుగులో అవినీతి విశ్వరూపాన్ని ప్రదర్శించారని బాబు ధ్వజమెత్తారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయన్నారు.

 అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

వచ్చే ఎన్నికలు మనందరికీ పరీక్ష వంటివని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షలో టిడిపి విజయం సాధించేలా ప్రతీ కార్యకర్త, ప్రజలు ఆశీర్వదించాలని అభ్యర్ధించారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

సీమాంధ్ర మరో స్వర్ణాంధ్రగా మారేందుకు మీ ఆశీస్సులే తనకు ఉపకరిస్తాయని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగనీయకుండా జనరంజక పాలనను అందించి అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

రాష్ట్ర విభజన బాధాకరమే.. అయినప్పటికీ దీనిని సవాలుగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభద్రతా భావం చోటుచేసుకున్నా, ఆత్మస్థైర్యం కలిగినా మరింత అధోగతి పాలవుతామని బాబు హెచ్చరించారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

శ్రీకాకుళం పర్యటన తనకు కొత్తకాదన్నారు. అయితే ఈసారి పర్యటన ఎర్రన్నాయుడు మరణం తరువాత ఇదే ప్రథమమన్నారు. ప్రజాగర్జన కార్యక్రమానికి లభించిన స్పందన చూసి తనలో పట్టుదల, కసి మరింత రెట్టింపవుతున్నాయని చెప్పారు.

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

అప్పుడే నేనేంటో చూపిస్తా, జెండా పట్టిన బాబు(పిక్చర్స్)

తనపై ఆశలు పెట్టుకున్న అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కట్టుబడి వారి కలలను సాకారం చేసే బాధ్యతను తన భుజాన వేసుకుంటానన్నారు. జిల్లాలో తనకు లభించిన స్వాగతాన్ని ఎప్పుడు మరచిపోలేనన్నారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి ఇతర రాజకీయ పక్షాలను తరిమికొట్టాలన్నారు.

English summary
Photos of Telugudesam Party Praja Garjana in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X