వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ 'సేవ్ డెమొక్రసీ': ఎమ్మెల్యే మణిగాంధీపై దాడికి యత్నించిన టీడీపీ సర్పంచ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులకు నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.

విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సేవ్ డెమొక్రసీ కార్యక్రమంలో పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ బృందం ఈ నెలాఖరును ఢిల్లీలో పర్యటించనుంది.

విజయవాడలోనూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ బొమ్మపై ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరడం అన్యాయంగా పేర్కొన్నారు. టీడీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేలకు దమ్మూ, ధైర్యం ఉంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు.

kodumur mla mani gandhi

ఎమ్మెల్యే మణిగాంధీపై దాడికి యత్నించిన టీడీపీ సర్పంచ్

వైసీపీ నుంచి టీడీపీలోకి ఇటీవల చేరిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి తెలుగుదేశం సర్పంచ్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా, ఆర్ కొంతలపాడు సర్పంచ్ సాయికృష్ణ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై మణిగాంధీపై దాడికి యత్నించారు.

"చంద్రబాబునాయుడికి రూ. 7 కోట్లకు అమ్ముడై తెలుగుదేశంలోకి వచ్చిన నువ్వా మాట్లాడేది? ఆ డబ్బుతో మరుగుదొడ్లు కట్టించు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ చార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఏం చెబితే అంత. నువ్వు ఎమ్మెల్యేవు మాత్రమే. మా రెడ్డి ఏం చెబితే అధికారులు అదే వింటారు" అని ఆగ్రహంతో ఊగిపోయారు.

ఈ ఘటన అనంతరం ఎమ్మెల్యే మణిగాంధీ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి తనకు రక్షణ కావాలని కోరగా, అక్కడికి చేరుకున్న పోలీసులు సాయికృష్ణను బయటకు పంపించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే సైతం సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.

English summary
Tdp sarpanch attacked on kodumur mla mani gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X