లోకేష్ పిలుపుతో కదిలిన పార్టీ శ్రేణులు.. ప్రతి గడపకూ రెండేళ్ల పాలనా విజయాలు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచార కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం సాధించిన పురోగతిని, అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో పార్టీ నాయకులు, శ్రేణులు నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ మహా ప్రజా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతి ఇంటి గడప తొక్కుతున్నారు.

గడిచిన రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అందించిన సుపరిపాలన విజయాల వివరాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను వివరిస్తూ కరపత్రాలను అందజేస్తున్నారు.
కేవలం పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా, ప్రజల అభిప్రాయాలు, సూచనలు, స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృతంగా సాగుతున్న ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలు తెలుసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ బంధాన్ని మరింత బలపేతం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకుసాగుతోంది. ప్రతి ఇంటిని కవర్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ 45 రోజుల సుదీర్ఘ ప్రచార కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications