టార్గెట్ పవన్ కళ్యాణ్ - టీడీపీ..బీజేపీ కామెంట్లు షురూ : జనసైనికుల కౌంటర్ ఎటాక్..!!
ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ పొత్తుల వ్యాఖ్యలు..మూడు ఆప్షన్లు కొత్త చర్చకు కారణమయ్యాయి. తాను ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చానని.. ఇప్పుడు టీడీపీ తగ్గాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. జనసేనతో పొత్తు కావాలంటే..టీడీపీ కొంత తగ్గాలని పవన్ పరోక్షంగా సీట్ల విషయంలో ముందస్తు సూచనలు చేసారు. తన వద్ద మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ టీడీపీతో కలిసి పోటీ చేయటం..లేదా టీడీపీతో పాటుగా బీజేపీతో కలిసి మూడు పార్టీలు బరిలో నిలవటం..కాకుంటే తాము ఒంటరిగా అయినా పోటీ చేయటానికి సిద్దమైనే సంకేతలు చాలా క్లియర్ గా పవన్ ఇచ్చేసారు. దీంతో..ఇప్పుడు దీని పైన టీడీపీ - బీజేపీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ వ్యాఖ్యలపై బుచయ్య ట్వీట్
సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు అభిమానులు ... పొత్తల విషయంలో పవన్ వ్యాఖ్యలు సరైనవి కావంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఆయన పవన్ పేరు ప్రస్తావించుకుండా..సేనాధిపతి అంటూ ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో.. ఖ్యింటా కాట తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి...కానీ ఆ కొన్ని వడ్లు వల్లనే మొత్తం కాట తుగింది అనుకుంటే ఎలా....సేనాధిపతి...! అంటూ పోస్టు పెట్టారు. దీనికి జనసైనికులు సీరియస్ గా స్పందించారు. బుచ్చయ్య వ్యాఖ్యలను కౌంటర్ చేసారు. 2014లో పవన్ మద్దతుతో ఎలా ఓట్లు వచ్చాయి.. 2019 లో ఎలా ఓట్లు చీలాయో వివరిస్తూ జనసైనికులు...పవన్ అభిమానులు ఆయనకు సమాధానంగా ట్వీట్లు చేస్తున్నారు.
దిద్దుబాటు.. జనసైనికుల కౌంటర్ ఎటాక్
ఇక, తాజాగా బుచ్చయ్య మరో ట్వీట్ చేసారు. అందులో.. వడ్లు తూగడం గురించి మాట్లాడితే గొడ్ల (నీలి రంగు) బ్యాచ్ కి కంగారు ఎందుకు...? ఈ సారి అవతలి పక్క ఎంత బరువు ఉన్న కాట తుగాక తప్పదు...151 కేజీల రాయి బొక్కబోర్లా పడాల్సిందే...ఎడ్డీ గారి చక్రాలు విరగాల్సిందే....! Any doubts....పే టియం ఫాల్క్స్....? అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీని పైన స్పందనలు మొదలయ్యాయి. ఇక, అటు బీజేపీ నేత నాగోరు రమేష్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ధి పవన్ కళ్యాణ్ అనే అంశం పైన..అదే విధంగా కొందరు చేస్తున్న డిమాండ్ పైన ఆయన స్పందించారు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.

బీజేపీ నేతలు సైతం మొదలెట్టేసారు..
డిమాండ్లు, అల్టిమేట్‌లకు బీజేపీ కార్యకర్తలు ఎవరు భయపడరని రమేష్ నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీకి నియమావళి ఉందని తెలిపారు. అయితే, పవన్ పొత్తుల ఆప్షన్ల పైన టీడీపీ ముఖ్య నేతలు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అదే విధంగా బీజేపీ సీనియర్ నేతలు మాత్రం తాము జనసేనతో కలిసే ఉన్నామని చెబుతున్నారు. ఇక, నడ్డా పర్యటన పైనా ఆసక్తి నెలకొని ఉంది. పవన్ వ్యాఖ్యలతో పొత్తుల పైన అంతిమంగా ఏం జరగబోతుందనే ఆసక్తి మాత్రం పొలిటికల్ సర్కిల్స్ ప్రధానంగా చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications