విజయసాయి ఫోన్ ఎలా పోయింది? చంద్రం చిప్ ఎలా దొబ్బింది? టీడీపీ వర్సెస్ వైసీపీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ పోయిన వ్యవహారం రాజకీయాలలో రచ్చ గా మారింది . రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫోను పోయిందని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏపీలో ఆసక్తికర చర్చకు కారణం గా మారింది. వివిధ కార్యక్రమాలలో పర్యటించిన విజయసాయిరెడ్డి తన ఫోన్ ఎక్కడ పోయిందో కూడా గమనించలేదు అని ఫిర్యాదులో పేర్కొనడంతో ఏపీలో విజయసాయి రెడ్డి ఫోన్ పోయిన వ్యవహారం దుమారం రేపింది.

సాయిరెడ్డి ఫోన్ పోవటంపై ఏపీలో రాకీయ రగడ
విజయసాయి రెడ్డి ఫోన్ ఎక్కడా పోలేదని ఇదంతా సాయి రెడ్డి ఆడుతున్న డ్రామా అని తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రా రెడ్డి ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, తనను కూడా అరెస్టు చేస్తారన్న భయంతో సాయి రెడ్డి సెల్ ఫోన్ ను దాచిపెట్టారని, చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ వ్యవహారంలోనూ ఆందోళనలో ఉన్న విజయసాయిరెడ్డి తన ఫోన్ దాచిపెట్టి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారని టిడిపి నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోల్ ప్రశ్న వేశారు.

సాయిరెడ్డి ఫోన్ ఎలా పోయింది అంటూ టీడీపీ ఒపీనియన్ పోల్ ప్రశ్న
విజయ సాయి ఫోన్ ఎలా పోయింది?
(ఏ) కృష్ణా నదిలో విసిరేశారు
(బి) రుషికొండ తవ్వకాల్లో పడేశారు
(సి) తాడేపల్లి ప్యాలెస్ లాగేసుకుని దాచేసింది
(డి) చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లోనే ఉంది. అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది .

నెటిజన్ల నుండి భిన్న స్పందన
ఇక అది మామూలు ఫోన్ కాదు చిత్రగుప్తుడు తయారు చేసిన పాపాల చిట్టా అంటూ పేర్కొన్న టిడిపి సాయి రెడ్డి ఫోన్ దొరికితే సీబీఐకి ఇవ్వాలి అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుండి అనేక భిన్నమైన సమాధానాలు వచ్చాయి. కొందరైతే ఫన్నీగా పైవన్నీ అంటూ ఈ ఆప్షన్ పెట్టి మరీ సమాధానమిచ్చారు. విజయ సాయి రెడ్డి సెల్ ఫోన్ ఎలా పోయింది అన్న దానిపైన రాజకీయవర్గాలలో గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా పెద్ద చర్చ జరిగేలాగా టిడిపి ఆసక్తికర ప్రశ్నను పోస్ట్ చేసి సాయి రెడ్డి ని టార్గెట్ చేసింది.
చంద్రబాబును టార్గెట్ చేసి రివర్స్ ఎటాక్ చేసిన విజయసాయిరెడ్డి
ఇక దీనికి రివర్స్ కౌంటర్ వేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు చిప్పు దొబ్బింది అని, చంద్రబాబుకు మైండ్ పనిచేయడం లేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు.
చంద్రం చిప్ ఎలా దొబ్బింది?
(ఏ) మాధవ రెడ్డి ఫాంహౌజ్ లో ఉంది.
(బీ) బోకేష్ దొబ్బేశాడు.
(సీ) టీడీపీ చిల్లర దొంగలు కాజేశారు.
(డీ) అమరావతి రియల్ ఎస్టేట్ భూముల్లో పాతేశాడు. అంటూ తనదైన శైలిలో రివర్స్ ఎటాక్ చేశారు.

కొనసాగుతున్న సంచలన వ్యాఖ్యల పర్వం
మొత్తానికి ఏపీలో విజయసాయి రెడ్డి సెల్ ఫోన్ పోయిన వ్యవహారం సంచలనంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ఇది ఒక కారణంగా మారింది. ఇప్పటికీ ఈ వ్యవహారంపై రెండు పార్టీల మధ్య సంచలన వ్యాఖ్యల పర్వం కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications