2014 ఎన్నికల్లోపు టి, తర్వాతే విలీనంపై: తేల్చేసిన డిగ్గీ

Telangana before 2014: Digvijay
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో అన్నారు. అవసరమైతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అయినా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాము తెలంగాణ రాష్ట్ర సమితి విలీనంపై మాట్లాడుతామని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక స్టీరింగ్ కమిటీ విషయం తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభకు ఇచ్చిన గడువును పెంచే విషయం రాష్ట్రపతి చూసుకుంటారని చెప్పారు.

సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై చర్చ సమయంలో తమ తమ ప్రాంత అభిప్రాయాలు చెప్పుకోవాలన్నారు. చర్చ ద్వారా అభిప్రాయాలు చెప్పుకునేందుకు మంచి సమయం ఉందన్నారు.

కాగా, ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణ బిల్లు వస్తుందో రాదో చెప్పలేనని దిగ్విజయ్ సింగ్ ఐదు రోజుల క్రితం అన్నారు. బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరగడం సంతోషకరమని, ఇది శుభ పరిణామమన్నారు. అభిప్రాయ సేకరణ కోసమే తాము బిల్లును అసెంబ్లీకి పంపించామన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు అభిప్రాయం చెప్పేందుకు సమయమిచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు వస్తుందో రాదో తెలియదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+