డోంట్ కేర్: యాష్కీ, 2 రాష్ట్రాల్లో ఉగాది, కిరణే వల్లే: డిఎస్

కొందరు రాజకీయ పార్టీల నాయకులు సొంత లాభం మానుకుంటే వెంటనే తెలంగాణ వస్తుందని వ్యాఖ్యానించారు. ఎవరు కుట్ర చేసినా తెలంగాణ ఆగదన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడతారని చెప్పారు. ఓట్ ఆన్ బడ్జెట్ సమయంలోనే బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.
హామీ ఇచ్చారు.. అనుమానమొద్దు: డిఎస్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కచ్చితమైన హామీ ఇచ్చారని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ అన్నారు. ఉగాది పండుగను రెండు రాష్ట్రాల్లో జరుపుకుంటామన్నారు. తెలంగాణను సాధించి తీరుతామని, ధైర్యంగా ముందుకు వెళ్దామన్నారు. సోనియా దయతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయ్యారన్నారు. ముఖ్యమంత్రిని సంప్రదించాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని, అడ్డుకునే ప్రయత్నం చేసి అంతా గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి అవరోధాల్లేవని చెప్పారు.
తెలంగాణ, సీమాంధ్ర వర్ధిల్లాలి: కవిత
తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలు వర్ధిల్లాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లాలో అన్నారు. ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications