మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్ మంజూరు
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.25వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీత దంపతులకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. వారు సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సీబీఐ కోర్టు తీర్పును నిలిపిసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. కేసు విచారణను డిసెంబరు 16కి వాయిదా వేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు బెయిల్ లభించింది. వారిద్దరికీ సీబీఐ న్యాయస్థానం ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది. వీరితో పాటు బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్‌కూ చెరో ఐదు సంవత్సరాల శిక్ష వేసింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. కొత్తపల్లి గీత దంపతులు సీబీఐ కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

2014లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీని వీడి 2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పారు. తర్వాత బీజేపీలో చేరి తన పార్టీని కూడా అందులో విలీనం చేశారు. ఉమ్మడి ఏపీలో ఆమె డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో భర్త రామకోటేశ్వరరావుకు చెందిన కంపెనీల పేరిట విలువైన భూములను బదలాయించారన్న ఆరోపణలున్నాయి. వాటినే తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు. తర్వాత ఆ అప్పును ఎగ్గొట్టారు. తెలంగాణకు చెందిన ఒక మంత్రి కుమారుడితోను వ్యాపార లావాదేవీలున్నప్పటికీ విభేదాలు వచ్చి ఇరువర్గాలు మీడియాకు ఎక్కాయి.












Click it and Unblock the Notifications