సీఎం జగన్, సీబీఐకు తెలంగాణ హైకోర్టు నోటీసులు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్..సీబీఐకు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌ పైన ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే సీఎం జగన్ కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని అభ్యర్దించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్ పై విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. హరిరామజోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.

Telangana HIgh Court issues notices for CM Jagan and CBI in Hari Rama Jogaiah PIL

సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోర్టుకు జోగయ్య వినతి చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని ఈ పిటీషన్ ద్వారా హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులు సీఎం జగన్, సీబీఐతో పాటుగా సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు వరుస కేసుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన పైన వాదనలు పూర్తి కావటంతో..రేపు (గురువారం) సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు హైకోర్టులోనూ చంద్రబాబు బెయిల్ పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమయంలో ఇటు సీఎం జగన్ పైన హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్ లో విచారణ..తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వటంతో ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+