సంచలనం.. జనసేన అభ్యర్థి ఇంటికి వెళ్లిన తెలుగు స్టార్ హీరో
ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. సమయం కూడా ఎక్కువగాలేదు. రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. ఇటువంటి తరుణంలో అకస్మాత్తుగా జనసేన పార్టీకి తెలుగు సీనియర్ హీరో సుమన్ నుంచి మద్దతు లభించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి జనసేన తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి ఇంటికి వచ్చిన సుమన్ ఆయనకు మద్దతు ప్రకటించారు. నిస్వార్థమైన నాయకుడని, ప్రజల కోసం సొంత డబ్బు ఖర్చుపెట్టే నాయకుడని కొనియాడారు.
ప్రస్తుతం ప్రజలకు కూడా ఇలాంటి వ్యక్తులే కావాలని, అందరూ ఆయనకే ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని, అభివృద్ధి చేసే నాయకులనే ఎంచుకోవాలని సుమన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాలపై కూడా సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలు మాత్రం ఎందుకో తిరస్కరించారన్నారు.

ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పాటై పోటీచేస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ నియోజకవర్గాలు దక్కగా కాకినాడ నుంచి టీటైమ్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీచేస్తున్నారు. మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే జనసేన అభ్యర్థులు పెండింగ్ లో ఉన్నారు. తాడేపల్లి గూడెంలో ప్రచారం చేసుకోవాలంటూ బొలిశెట్టికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించడంతో ఆయన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ నేతలను కలుపుకొని ముందుకు వెళుతున్నారు. తమ నేత సొంత డబ్బు ఖర్చుపెట్టి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పరిహారం అందించారని, అధికారంలోకి వస్తే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలను పవన్ కల్యాణ్ అందిస్తారని బొలిశెట్టి ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications