పుత్తూర్: 'ఉగ్ర' హైడ్రామా, మహిళ లొంగుబాటు(పిక్చర్స్)
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఉగ్రవాదులను, వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి శనివారం పట్టుకున్న విషయం తెలిసిందే. పోలీసులు పదిగంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులు ఉన్న ఇంట్లోకి బాష్పవాయువు ప్రయోగించి అరెస్టు చేశారు. వారి లక్ష్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలేనని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో గాయపడటంతో ఒకతనిని పుత్తూరు ఆస్పత్రికి, మరొకతన్ని చెన్నైకి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంటిలో దాక్కున్న ఉగ్రవాదులు ఆల్ - ఉమాకు చెందినవారని సమాచారం. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడానికి ముందు ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు లొంగిపోయారు. ఇంటికి కన్నం వేసి బ్లాక్ క్యాట్ కమెండోలు, ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బలగాలు లోనికి గ్యాస్‌ను పంపించారు. ఈ క్రమంలో వారు లొంగిపోయారు.
పదకొండు గంటల హైడ్రామా మధ్యన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. పుత్తూరులో ఉగ్రవాదులు బిలాల్ మాలిక్, అతని భార్య ఫాతిమా భాను, ముగ్గురు పిల్లలు, బావమరిది ఇస్మాయిల్ తొమ్మిది మాసాల క్రితం గేటు వీధిలోని హుస్సేన్ ఇంటిలో అద్దెకు దిగారు.
తాము పాత దుస్తుల వ్యాపారం చేస్తున్నామని, మరికొన్ని దఫాలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటామని, పాత ఇనుప సామాన్లు అమ్ముతామని నమ్మబలికారు. ఫాతిమా ఇటీవల ఆ వీధిలో గొడవ పడటంతో యాసిన్ ఇంటిలోకి మారారు. నెల రోజులుగా వారు అక్కడ ఉంటున్నా బయట ఎవరితోను కలిసే వారు కాదంట.

అద్దెకు తీసుకున్న ఇల్లు
పుత్తూరులోని గేటు వీధిలో ఉగ్రవాదులు అద్దెకు తీసుకున్న ఇల్లు ఇదే. తొమ్మిది నెలల క్రితం వీరు ఇక్కడ ఇల్లును అద్దెకు తీసుకున్నారు.

పోలీసులు
తమిళనాడుకు చెందిన పోలీసులు, స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) సిబ్బంది సుమారు 50 మంది తెల్లవారుజామున 3.45 గంటలకు పుత్తూరుకు చేరుకున్నారు.

పోలీసులు 2
గేటు వీధిలో ఇస్మాయిల్, బిలాల్ మాలిక్ ఉన్న ఇంటికి ఫక్రుద్దీన్ దారిచూపాడు. మొదటి అంతస్తులో ఉన్న ఆ ఇంటికి అప్పటికే తాళం వేసి ఉంది. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో ఒక రివాల్వర్, రెండు బాంబులు, జెలిటిన్ స్టిక్స్ కనిపించాయి.

పోలీసులు 3
ఉగ్రవాదులు తాము ఇనుప సామాను కొనేవారిగా, ఫైనాన్స్ వ్యాపారం చేసేవారిగా చెబుతూ స్థానికులను నమ్మబలికారు. పోలీసులు వచ్చి ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో గుమికూడిన ప్రజల దృశ్యం.

ఇల్లు
గేటు వీధిలో ఉండగా ఫాతిమా ఇటీవల ఆ వీధిలో గొడవ పడటంతో యాసిన్ ఇంటిలోకి మారారు. నెల రోజులుగా వారు అక్కడ ఉంటున్నా బయట ఎవరితోను కలిసే వారు కాదంట.

ఉగ్రవాది 1
తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడ్డ ఉగ్రవాదిని తీసుకువెళ్తున్న పోలీసుల దృశ్యం.

ఉగ్రవాది 2
తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడ్డ మరో ఉగ్రవాదిని తీసుకువెళ్తున్న పోలీసుల దృశ్యం.

ఉగ్రవాది 3
తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో చిత్తూరు జిల్లా పుత్తూరులో పట్టుబడ్డ మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకొని పట్టుకుపోతున్న పోలీసుల దృశ్యం.

లొంగుబాటు
ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడానికి ముందు ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు లొంగిపోయారు. వారిని ప్రశ్నిస్తున్న పోలీసులు.

పోలీసులు
తమను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను ఉగ్రవాదులు బాంబులున్నాయని బెదిరించారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల వారి ఇళ్లను ఖాళీ చేయించారు.

లొంగిపోయిన మహిళను తీసుకెళ్తూ..
ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడానికి ముందు ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు లొంగిపోయారు. ఆమెను తీసుకు వెళ్తున్న పోలీసులు.

గుమికూడిన జనం
ఉగ్రవాదులు నివసిస్తున్న ఇంటిని వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. చిత్తూరు ఎస్పీ కాంతిరాణా టాటా పుత్తూరుకు చేరుకున్నారు. లొంగిపోవాలని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఈ సమయంలో గుమికూడిన ప్రజలు.












Click it and Unblock the Notifications