వైసీపీ దెబ్బతో సెంట్రల్ జైలుకు వెంకటరెడ్డి, ఏసీపీ దెబ్బతో హడల్

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని విచారణ చేసిన ఏసీబీ అధికారులు ఆయన నుండి సమాచారం రాబట్టారని తెలిసింది. తరువాత వెంకటరెడ్డిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న ఏసీబీ ప్రత్యేక కోర్టు గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అక్టోబర్ 10వ తేదీ వరకు రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈనెల 11వ తేదీన వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో జీసీకేసీ, ప్రతిమ సంస్థ, జేపీవీఎల్ తదితర సంస్థలపైన కూడా కేసులు నమోదు అయ్యాయి. అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో మూడు సంస్థలకి లబ్ధి కలిగించేలా వెంకటరెడ్డి చూసి చూడనట్లు వివరించారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. వెంకటరెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని వెంకటరెడ్డి మీద ఆరోపణలు చేశారు.

The ACB court has issued orders to remand the former MD of the Department of Mines Venkata Reddy

చాలా రోజుల నుండి తప్పించుకుని తిరుగుతున్న గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని గురువారం రాత్రి హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1 వెంకటరెడ్డిని అరెస్టు చేయడంతో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు హడలిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ. 2, 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదే కేసులో వెంకట్ రెడ్డి ఏ1 నిందితుడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకట్ రెడ్డి 2019లో డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ వచ్చారు. కొద్ది నెలల్లోనే గనుల శాఖ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి వైసీపీ నాయకులు చెప్పినట్లు చేశాడని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారని ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో నియమాల ఉల్లంఘించిన వెంకటరెడ్డి ఆ శాఖలో ఎవరికంటే వాళ్లకు కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు ఇచ్చేశారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్కు కూడా ఇదే శాఖ నుండి జీతాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సుమారు రూ. 800 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇసుక కాంట్రాక్టు తీసుకున్న ఓ సంస్థ చెల్లించాల్సి ఉన్నా ఆ సంస్థకు వెంకటరెడ్డి ఎన్ఓసి ఇచ్చేశారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వెంటటరెడ్డి గోల్ మాల్ వివరాలను ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారని తెలిసింది. వెంకటరెడ్డి వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని ఏసీబీకి చెందిన ఓ సీనియర్ అధికారి అంటున్నారు. ఇప్పటికే వెంకట్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారనే భయంతో హడలిపోతున్నారని తెిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+