ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - బిగ్ టర్న్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ ప్రభుత్వం పాలనా పరంగా- రాజకీయంగా నిర్ణయాలను వేగవంతం చేస్తోంది. మరో మూడు నెలల కాలంలో పలు నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన కుల గణనకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీంతో, ఇక ఇంటింటికి వెళ్లి సిబ్బంది 20 అంశాలకు సంబంధించి సమాచారం సేకరిస్తారు.

సర్వేపై నిర్ణయం:రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు పూర్తి చేసింది. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి కానుంది. ఈ సర్వేలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాల పై సమాచారం సేకరిస్తారు. వాలంటీర్లు ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నా..కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా అలాంటి వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన తరువాత మరో వారం గడువు ఇవ్వనున్నారు.

The AP Govt issues latest Guide lines on comprehensive caste census across the state

వివరాలు సేకరణ:ఈ సమయంలో సంబంధిత కుటుంబసభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి. కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్ లో ప్రత్యేక యాప్ పొందుపరిచారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు ఒకే సెల్ ఫోన్ ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు గానీ, పూర్తి అయిన తరువాత గానీ, స్క్రీన్ షాట్ లేదా వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా యాప్ ను డిజైన్ చేసారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహ వివరాలు, కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నంబర్, విద్యార్హత, ఇంటి వివరాలు, వంట గ్యాస్ తో పాటుగా ఉపాధికి సంబంధించిన వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.

ప్రజలకు సౌకర్యవంతంగా:ఎక్కడైతే నివాసం ఉంటున్నారో దాన్నే శాశ్వతి చిరునామాగా పరిగణించి నమోదు చేస్తారు. కుటుంబలో ఎవరైనా వ్యక్తి చనిపోతే అదే కుటుంబలోని మరొకరు దాన్ని నిర్దారిస్తూ వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో, త్వరలో నిర్వహించనున్న కులగణనకు సిద్దంగా ఉండాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులకు సూచనలు చేసింది. తాజా సమీక్షలో ప్రాధమికంగా ఎదురైన సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చలు జరిగాయి. ఇప్పటికే రూపొందించిన సర్వే యాప్ లో ఉన్న కొన్ని మార్పులు, చేర్పులకు సంబంధించి కొన్ని సూచనలు చేసారు. కులగణనలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి గుర్తింపు కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+