'నరేష్-పవిత్రా లోకేష్' కు అనుకూలంగా తీర్పు చెప్పిన కోర్టు
ప్రముఖ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి మళ్ళీ పెళ్లి(తెలుగు),మట్టే మదువే (కన్నడ) చిత్రాలను థియేటర్ లో, ఓటీటీలో విడుదల చేయడాన్ని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం రమ్యరఘుపతి వ్యాజ్యాన్ని కొట్టేసింది. సినిమాను విడుదల చేయకుండా ఉండేందుకు ఆమె చెప్పిన కారణాలను న్యాయస్థానం అంగీకరించలేదు. న్యాయపరంగా కేసులో నిలకడ లేదని కొట్టేసింది. సినిమా అనేది పూర్తిగా కల్పితమంటూ సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.

సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత ప్రయివేటు వ్యక్తులెవరూ దీన్ని అడ్డుకోలేరని వ్యాఖ్యానించింది. నరేష్ పై రమ్య గృహ హింస కేసుతోపాటు నరేష్-పవిత్ర లోకేష్ పై కూడా కేసు దాఖలు చేసింది. నానక్‌రామ్‌గూడలోని ఇంట్లోకి రానివ్వడంలేదంటూ రమ్య రఘుపతి మరో పిటిషన్ వేశారు. నరేష్ పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసులు రమ్య దాఖలు చేశారు. నరేష్, ఆయన కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతి పై గృహ హింస కేసు పెట్టారు. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.

నరేష్, అతని కుటుంబ సభ్యులు అందజేసిన సాక్ష్యాల ప్రకారం, రమ్య రఘుపతి అక్కడ ఉండటానికి వీల్లేదంటూ తీర్పును వెలువరించింది. నరేష్ ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం రమ్య ఉపయోగిస్తోందనే ఆరోపణలను కూడా న్యాయస్థానం నిర్ధారించింది.రమ్య కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తులవల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్లు, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురవుతున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. 'మళ్ళీ పెళ్లి' సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్‌లతో పాటు జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటించారు.












Click it and Unblock the Notifications