సీఎం జగన్ కేసుల్లో రోజు వారీ విచారణ- నేటి నుంచే : హైకోర్టు స్పష్టత..!!

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. కేసుల వారీగా నిందితులు దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ చేపతామని తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు తమపై కేసులు కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పలు పిటీషన్ల పైన జస్టిస్ షమీమీ్ అక్తర్ విచారణ చేపట్టారు. పిటీషనర్ల తరపు న్యాయ వాదులు వినోద్‌ దేశ్‌పాండే, టీ నిరంజన్‌రెడ్డి, శివరాజ్‌ శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌లు వాదిస్తూ ఒక్కో కేసుపై విచారణ చేపట్టి అందులో నిందితులు దాఖలు చేసిన అన్ని పిటీషన్ల పైన విచారణ చేపట్టాలని కోరారు.

కేసుల వారీగా విచారణ
తొలుత దాఖలు చేసిన కేసుల వారీగా విచారణ చేపట్టాలన్నారు. వారం రోజులు గడువు ఇవ్వాలని.. లేదంటే వచ్చే వారం విచారణ చేపట్టాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఇప్పటికే ఆలస్యం అయిందని.. కేసులు దాఖలై ఎంత కాలం అయిందో చూడాలని వ్యాఖ్యానించారు. ఈ రోజు నుంచి విచారణ చేపడతామని..అందుకు న్యాయవాదులు సిద్దంగా ఉండాలని సూచించారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన 12 కేసుల్లో 4 కేసుల్లోని నిందితులు మినహా మిగిలిన కేసుల్లోని నిందితులు పిటీషన్లు దాఖలు చేసారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

The High Court has decided to hold a day-to-day hearing in the Jagan cases

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu

    నేటి నుంచే ప్రారంభం
    తొలుత హెటిరో..అరబిందో కేసు నమోదైందని వివరించారు. దీంతో.. వాటితోనే విచారణ ప్రారంభిద్దామని న్యాయమూర్తి స్పష్టం చేసారు. ఆ సమయంలో పిటీషనర్ల తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ కింది కోర్టులో జరుగుతున్న విచారణ పైన రెండు వారాలు స్టే ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. ఈ రోజు వరకు స్టే ఉందని గుర్తు చేసారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జడ్చర్లలో భూకేటాయింపులకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో హెటిరో, అరబిందో కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+