CM Jagan: టీడీపీ నేతకు రూ.20 లక్షల సాయం చేసిన జగన్ ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గొప్ప మనస్సు చాటుకుంది. లివర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సాయం చేసింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె.కృష్ణకు లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా.. చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణ భార్య లక్ష్మికి ఇచ్చారు.
కృష్ణ గత కొంత కాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మురళి మంత్రి రాజాకు చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి సీఎం రీలిఫ్ ఫండ్ కింద నిధులు అందించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అన్ని ఫార్మలిటీస్ పూర్తి చేసిన సీఎం రీలిప్ ఫండ్ వచ్చేలా చూశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద చాలా మందికి సాయం చేశారు.

సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నప్పుడు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇద్దరు బాధితులు సీఎంను కలిశారు. బాధితుల అనారోగ్య సమస్యను జగన్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే జగన్ కలెక్టర్ మాధవిలతో మాట్లాడి.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఇచ్చారు. జబర్దస్త్ షో ఫేం పంచ్ ప్రసాద్ చాలా రోజుల నుంచి కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ అలాగే జీవనం జీవిస్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం పంచ్ ప్రసాద్ కు సాయం చేసింది. వరదల వల్ల నష్టపోయిన వారికి కూడా జగన్ ప్రభుత్వం సాయం అందించింది. వరదలతో ఇల్లు ధ్వంసం వారికి రూ.10వేలు అందించారు.












Click it and Unblock the Notifications