తిరుపతిలో భార్య, బావమరిదిని చంపిన వ్యక్తి..
తిరుపతిలోని ఓ హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ హోటల్ లో భార్య, బావమరిదిని హత్య చేశాడు ఓ వ్యక్తి. హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి పోలీసులకు లొంగిపోవటం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. మహారాష్ర్టకు చెందిన యువరాజు అనే వ్యక్తి తన భార్య, బావమరుదులను దారుణంగా చంపేసాడు. ఆ తర్వాత తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లోంగిపోయాడు.
మహారాష్ర్టకు చెందిన కుటుంబం: మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన యువరాజు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చింది. అయితే, దేవుని దర్శనానికి ముందు తిరుపతిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. హోటల్ రూమ్ లో ఉండగా వారివురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కోపోద్రిక్తుడైన యువరాజ్ తన భార్య మనీషా,బావమరిది హర్షవర్ధన్ లను హత్య చేశాడు. ఆ తర్వాత అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లోంగిపోయినట్లు తెలుస్తోంది.

వివాహేతర సంబంధమే కారణం: నిందితుడు యువరాజ్‌కు పన్నెండళ్ల క్రితం మనీషాతో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. వారు షక్షమ్, ప్రజ్ఞాన్. బావమరిది హర్షవర్దన్‌తో కలిసి నాలుగురోజుల కిత్రమే తిరుపతి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. మనీషాకు నిందుతుడు యువరాజ్ అన్నతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే యువరాజ్, మనీషాలు ఏడాది నుంచి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్ధరి మధ్య ఉన్న గొడవలను సద్దుమణిగించేందుకు బావమరిది హర్షవర్ధన్ ప్రయత్నించినట్లు సమాచారం. అందులో భాగంగానే మనీషా, యువరాజ్, ఇద్దరూ పిల్లల్ని తిరుపతికి రప్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో భాగంగానే యువరాజ్ భార్య, బావమరిదిని అర్థరాత్రి రెండు గంటల సమయంలో చంపేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications