చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్ !!
అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో ఈ సంఘటన జరిగింది. వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లె సమీపంలోని ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు కావడం అప్పట్లో కలకలం రేపింది.
సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమరనాథ్ రెడ్డి (ప్రస్తుతం పలమనేరు ఎమ్మెల్యే), దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులపైన కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మదనపల్లెతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో వైసీపీ నాయకుల ఒత్తిడితో అంగళ్లలో జరిగిన రాళ్ల దాడి కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పైన తప్పుడు కేసులు నమోదు చేశారని విచారణలో వెలుగు చూసిందని, ఈ కేసును కొట్టివేయాలని పోలీసు అధికారులు మదనపల్లె ఒకటవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో నివేదిక సమర్పించారు.
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి అభ్యంతరాలు ఉంటే వారం లోపు కోర్టు ముందు హాజరై చెప్పాలని చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టిన వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డికి గత నెల 25వ తేదీన నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఒత్తిడితోనే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులపై అప్పుడు కేసులు పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయుకులపై నమోదు అయిన అంగళ్లు రాళ్ల దాడి కేసును కొట్టివేయాలని పోలీసులు కోర్టుకు మనవి చేశారు.

అయితే కేసు ఉపసంహరించుకోవడానికి వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి అంగీకరించలేదు గత ఏడాది వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం నాయకులు మీద మదనపల్లె సమీపంలోని ముదివేడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు గత ఏడాది ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సమయంలో మదనపల్లె సమీపంలోని అంగళ్లులో రాళ్ల దాడి జరిగింది. ఆ సందర్బంలో చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ సీనియర్ నాయకులుపైన కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో అని టీడీపీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications