ఆదిపురుష్ థియేటర్లల్లో ప్రతి షోలో ఒక సీట్ ఖాళీ- రామభక్త హనుమాన్ కోసం
అమరావతి: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే.
ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అభిమానులను పలకరించబోతోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాను టీ- సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకుడు. రామాయణం ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది యూనిట్.

మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియం దీనికి వేదిక. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభాస్ ఈ రాత్రికి తిరుపతికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అనంతరం నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున తిరుమలలో శ్రీవారి దర్శించుకుంటారు. స్వామివారి సేవల్లో పాల్గొంటారు.
అనంతరం శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడ విద్యార్థులతో ముఖాముఖి పాల్గొంటారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటారు ప్రభాస్. దీనికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన జీయర్ స్వామి హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంద మంది చొప్పున గాయకులు, కళాకారులు ప్రదర్శన ఇవ్వబోతోన్నారు.

కాగా- ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే అన్ని థియేటర్లల్లో కూడా ఒక సీట్‌ను ఖాళీగా ఉంచాలని చిత్రం యూనిట్ నిర్ణయించింది. ఫస్ట్ షో నుంచే ఓ సీట్ ఖాళీగా ఉంటుంది. ఆ సీట్‌ను హనుమంతుడికి కేటాయించింది. ఆంజనేయస్వామి స్వయంగా వచ్చి ఈ సినిమాను చూస్తాడని యూనిట్ విశ్వసించడమే దీనికి కారణం. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికీ హనుమంతుడు విచ్చేస్తాడని భక్తులు నమ్ముతుంటారు.

ఆ సంప్రదాయాన్ని, నమ్మకాన్ని గౌరవిస్తూ- రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ను సినిమాను చూడటానికి హనుమంతుడు వస్తాడని, రామభక్తునికి గౌరవ మర్యాదలను కల్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టామని పేర్కొంది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిపురుష్‌ను హనుమంతుడి సమక్షంలో వీక్షిద్దామని విజ్ఞప్తి చేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications