క్రికెట్ టీమ్ లో 11 మంది ఆటగాళ్లు, వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు, బొక్కపడితే మొదటికే మోసం ?
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. టీడీపీ 135 ఎమ్మెల్యే సీట్లు, జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు, వైసీపీ 11 ఎమ్మెల్యే సీట్లు, బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లు సంపాధించుకుంది. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటూ ఇటీవల ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి ఓ క్రికెట్ టీమ్ లో ఉండే ఆటగాళ్ల లాగా కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి.
పోతేపోనిలే ఓ క్రికెట్ టీమ్ లో ఉండే ఆటగాళ్ల సంఖ్య అయినా వచ్చింది అనుకుంటే ఇప్పుడు ఆ వైసీపీ క్రికెట్ టీమ్ కు కూడా బొక్కపడే చాన్స్ ఉందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే టీడీపీలోకి జంప్ అవుతారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంలో క్లారిటీ లేకపోయినా వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతారని ప్రచారం మాత్రం చాలా జోరుగానే జరుగుతోంది.

ఇప్పుడు వైసీపీకి చెందిన మాజీ ఎమమెల్యేలు సైతం టీడీపీ, బీజేపీ వైపు మొగ్గు చూపుకున్నారని, ఆ పార్టీ నాయకకులతో సంప్రదింపులు జరుపుతున్నారని వెలుగు చూసింది. వైసీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జారిపోయినా ఆ పార్టీకి ఉండే క్రికెట్ టీమ్ సంఖ్య కూడా తగ్గిపోతే ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఆ పార్టీ మీద నమ్మకం పోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేతో పాటు ఇంకా మరో ఎంపీ కూడా టీడీపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
అయితే ఇవి పుకార్లు మాత్రమే అని, 2029లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని కొందరు వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లను సొంతం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు పలు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడుతూ వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అంటే 151లో అటువైపు ఓ అంకె, లేదంటే ఇటు వైపు ఓ అంకె పీకేస్తామని వ్యంగంగా అన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పిన మాట ఎలా ఉన్నా ప్రజలు మాత్రం వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యలో మొదటి ఒక అంకె అంటే 1, చివరి ఒక అంకె అంటే 1 మాత్రమే వదిలేసి 140 మంది ఎమ్మెల్యేలను ఓడించి వారిని ఇంటికి పంపించేశారు. 11 మంది ఎమ్మెల్యేలతో డబుల్ డిజిట్ మిగిలింది అనుకుంటున్న వైసీపీ నాయకులు ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయితే ఉన్న పరువుపోతుందని ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications