బిల్లు కాదు మమ్మల్నే తగులబెట్టారు: హరీష్ రావు

మహాసాద్వి సీత అగ్ని పరీక్ష ఎదుర్కొని పునీతులయ్యారని, అలాగే తెలంగాణ బిల్లును దగ్ధం చేయడం ద్వారా అది పునీతమైందన్నారు. బిల్లును తగులబెట్టడం అంటే రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని అవమానించినట్లే అవుతుందన్నారు. సీమాంధ్రులు బిల్లును తగులబెట్టి క్షణం వికృతానందం పొందారన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పడి తీరుతుందన్నారు.
ఎపిఎన్జీవో నాయకులు డ్రాఫ్ట్ బిల్లును తగులబెట్టడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు ఏం సమాధానం చెబుతారన్నారు. వారి స్పందన ఏమిటో చెప్పాలన్నారు.
డ్రాఫ్ట్ బిల్లు 13 ఏళ్ల కెసిఆర్ పోరాటం, పన్నెండు వందల మంది తెలంగాణ వారి ఆత్మత్యాగం అన్నారు. అలాంటి బిల్లును దగ్ధం చేయడమంటే తమను తగులబెట్టినట్లే అన్నారు. అందరూ బాగుండాలని బోగి పండుగ జరుపుకుంటారని, సీమాంధ్ర నాయకులు మాత్రం తెలంగాణ నాశనం కావాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు.
29వ రాష్ట్రంగా త్వరలో తెలంగాణ ఏర్పడుతుందన్నారు. ధర్మం, న్యాయం ఎప్పుడు గెలుస్తాయని, ఈ విషయాన్ని సీమాంధ్ర నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బిల్లును అవమానిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బిల్లు తగుల బెట్టిన వారి పైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని అవమానిస్తుంటే డిజిపి చర్యలు తీసుకోవాలన్నారు. తమ నైజాన్ని బయటపెట్టుకున్న వారు... ఇంకా దోపిడీ కొనసాగాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications