ముఖ్యమంత్రులు జగన్ కు, రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఇదే.. ఇంట్రెస్టింగ్ డిస్కషన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . ఇరు ముఖ్యమంత్రుల మధ్య తేడాపై చర్చకు కారణం కూడా ఉంది.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నవరత్నాల హామీలను ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీ లతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. ఇలా అనేక విషయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలికలు ఉన్న సమయంలో పాలన విషయంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులను పోలుస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యలో ఉన్న వ్యత్యాసం చాలా ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటికి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం . జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుండి తాను ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నారు .ఇక ఈ హామీల అమలుకు ఆయన రాష్ట్ర ప్రజలను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల లబ్ధిదారులు అప్లై చేసుకోవడానికి వాలంటీర్ల ద్వారానే వివరాలు సేకరించి గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేయించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడలేదు. ఆ తర్వాత నేరుగా పథకాల తాలూకా నిధులను లబ్ధిదారులకు బటన్ నొక్కి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సంక్షేమ పథకాల అమలుపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. సామాన్యులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల హామీతో వచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి తాము ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం పేరుతో స్కీములకు అప్లై చేసుకునే వారి నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇక వీటన్నింటినీ పరిశీలించి, స్క్రూటినీ చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు ఇవ్వాలి అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైన్లో నిలబడకుండానే పథకాలను ఇస్తే, రేవంత్ రెడ్డి మాత్రం అర్హులకే నా ఓటు అంటున్నారు.
క్యూ లైన్ ల లెక్క తేలిన తర్వాతే అసలు పథకాల వర్తింపు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఇదేనని, ఈ విషయంలో రేవంత్ రెడ్డి కంటే జగన్ బెస్ట్ అంటూ పలువురు కితాబిస్తున్నారు.
-
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications