బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని మహిళపై గ్యాంగ్ రేప్: ముగ్గురి అరెస్టు

హైదరాబాద్: ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన మగ్గురిని హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఎల్బీ నగర్‌కు చెందిన ఓ మహిళ (26) రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్‌టీఆర్‌నగర్‌లో తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. బాధితురాలి కూతురికి ఆనారోగ్యంగా ఉండటంతో తల్లితోపాటు ఆదివారం సాయంత్రం నగరంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది.

చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వస్తూ చింతల్‌మెట్ బస్టాపులో బస్సు దిగారు. ఆ తర్వాత బాధితురాలు తన తల్లి, కూతురుతో కలిసి స్థానిక కల్లు కంపౌండ్‌లో కల్లు తాగారు. అనంతరం తల్లీకూతుళ్లను ఆటోలో ఇంటికి పంపించింది. ఆ తర్వాత బస్సు కోసం వేచిచూస్తున్న బాధితురాలి వద్దకు జలాల్‌బాబానగర్‌కు చెందిన ఫర్వేద్(26) వచ్చాడు. తాను ఇంద్రానగర్ వైపు వెళ్తున్నానని నమ్మించి బైక్‌పై కొద్దిదూరం తీసుకెళ్లాడు.

Three arrested in a gang rape case

తన బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని మాయమాటలు చెప్పి, స్నేహితులైన వాజీద్(45), ఫస్సీ (26)లను పిలిపించుకున్నాడు. వీరు ఆటోలో ఆమెను మీరాలం చెరువు వద్దకు తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. వారిబారినుంచి బయటపడిన బాధితురాలు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.

గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం

ఇదిలావుంటే, బహిర్భూమికి వెళ్లిన ఓ వివాహితపై విద్యార్థి ఒకరు లైంగికదాడికి పాల్పడ్డాడు. హయత్‌నగర్ మండలం ఇంజాపూర్‌లోని తుల్జాభవాని నగర్‌లో నివాసముండే వివాహిత మహిళ(26) ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తుండగా అదే కాలనీలో నివసముండే డిగ్రీ విద్యార్థి రమావత్ మోహన్(19) అటకాయించారు. ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+