కారులో వెళ్తున్న ముగ్గుర్ని కాల్చేశారు

మృతులు కోర్టు వాయిదాకు వెళ్తుండగా ఈ హత్య జరిగింది. మృతులు పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన వారని సమాచారం. వారు ఏలూరు ట్రావెల్స్ కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్చి 9వ తేదీన ఓ హత్య జరిగింది. ఆ కేసులోని ముద్దాయిలే ఇప్పుడు హత్యగావించబడినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యలకు ఆస్తితగాదాలు కారణమని అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్ ఏలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
టీచర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడలోమంగళవారం ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చుదుతున్న విద్యార్థిని టీచర్ల వేధింపులు తట్టుకోలేక పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రామవరప్పాడులో నివాసముండే ఓ వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు.
అతను విజయవాడ నగర పాలక సంస్థ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఈయన తన మూడవ కుమార్తె రామవరప్పాడు రింగ్ వద్దగల ఓ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆమెను కొద్దిరోజులుగా టీచర్లు చదువు పేరుతో వేధించటం మొదలుపెట్టారు. హేళనగా మాట్లాడేవారు.
ఈ విషయాన్ని ఆమె మూడు రోజుల క్రితం తన తల్లిదండ్రులకు చెప్పి భోరున విలపించింది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పి ఆమెకు ధైర్యం చెప్పి, పాఠశాలకు పంపుతున్నారు. అయితే వేధింపులు ఎక్కువైపోవటంతో మంగళవారం త్రైమాసిక పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ఆమె పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.












Click it and Unblock the Notifications