TTD: రద్దీ నియంత్రణకు టీటీడీ కీలక నిర్ణయాలు - భక్తులకు పీఏసీల్లో వసతులు..!!
Tirumala: తిరుమలలో రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ కీలక మార్పు లను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. గతం కంటే శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో క్యూ లైన్ల నిర్వహణ కోసం కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. భక్తుల వసతుల కోసం కొత్త కార్యాచరణ అమల్లోకి వచ్చింది. అదే విధంగా సాంకేతికత వినియోగం పైన టీటీడీ ఫోకస్ చేసింది. టీటీడీ తాజా నిర్ణయాలతో భక్తులకు ప్రయోజనకరంగా మారుతోంది.
కీలక నిర్ణయాలు
తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక ప్రక్షాళన చర్యలు చేపట్టింది. మెరుగైన సేవలు, రద్దీ నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. క్యూలైన్ మేనేజ్‌మెంట్, క్రౌడ్ మేనేజ్‌మెంట్ విధానాల అమలుతో రద్దీని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలతో భక్తులకు త్వరగా దర్శనం అందుతోంది. 2024 జులైలో 22 లక్షల 13వేల 330 మంది శ్రీవారిని దర్శించుకోగా, 2025 జులైలో ఆ సంఖ్య 23 లక్షల 76 వేల 949కి చేరింది. లడ్డూల ఉత్పత్తి సుమారు 19.63 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది వేసవి సెలవుల్లో కంటే తర్వాతే అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

భక్తులకు వసతులు
టికెట్లు.. దర్శనం విధానంలో టీటీడీ తెచ్చిన మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. ఏ రోజుకారోజు శ్రీవాణి టికెట్ల జారీ ఎక్కువ మందికి శ్రీవారి దర్శనభాగ్యం కలగడంతో గదుల్లో రద్దీ తగ్గింది. దర్శనం కోసం ప్రతి భక్తుడి కౌంట్ నమోదవడం, లైన్లలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యమవుతోంది. దీంతో పాటు ముందస్తుగా ఆన్‌లైన్ బుకింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. టీటీడీ అధికారులు రద్దీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తులను ఫ్రీజోన్‌లకు తరలించి తోపులాటలు జరగకుండా నియంత్రిస్తున్నారు. అనూహ్య రద్దీ ఏర్పడినప్పుడు ముందుగా భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. అధికంగా ఉండే భక్తులు రోడ్లపై ఇబ్బందులు పడకూడదని 4 పీఏసీల్లో వసతులు కల్పిస్తున్నారు.
దర్శనాల్లో మార్పులతో
గతంలో ఉదయం 5 గంటల నుంచి మొదలయ్యే బ్రేక్ దర్శనాలను ప్రస్తుతం ఉదయం 5.45 గంటల నుంచి ప్రారంభించి 10, 11 గంటలలోపు ముగిస్తున్నారు. దీంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు అవకాశం లభిస్తోంది. తిరుప్పావడ, అభిషేకం సేవలను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో పాటుగా కొత్త నిర్ణయాలను ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేసి పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టటం ద్వారా భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఫలితంగా భక్తులకు ఈ నిర్ణయాలు మేలు చేస్తున్నాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications