మీరు నిజంగా వెంకటేశ్వరస్వామి భక్తులే అయితే- వాళ్లను కడిగిపారేసిన వేణుస్వామి భార్య

Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లడ్డూ తయారీ కోసం వినియోగించే నెయ్యి తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ చెబుతూ వస్తోన్న వాళ్ల వాదనలు మరింత బలపడ్డాయి.

తేల్చేసిన సుప్రీం..

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Tirumala Laddu row Venu Swamy wife Srivani made key remarks after Supreme Court comments

వైసీపీపై ఆరోపణలు..

తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ చంద్రబాబు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వై సత్యకుమార్ సహా పలువురు జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఆరోపణలకు రాజకీయ రంగు పులిమారు.

ఆ పిటీషన్‌పై..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో దాడికి దిగారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవాలను వెలికి తీయాలంటూ, నిజం ఏమిటో నిగ్గు తేల్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కల్తీ జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. చంద్రబాబును తప్పుపట్టింది. రాజకీయాలకు కనీసం దేవుళ్లనయినా దూరంగా పెట్టాలంటూ హితబోధ చేసింది.

స్పందించిన శ్రీవాణి

దీనిపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి భార్య శ్రీవాణి స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంపై సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేశారని, ప్రజలు, భక్తుల మనోభావాలను ఎంతగానో హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులను పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు.. ఎంతో ఓవర్ యాక్టింగ్ చేశారంటూ అన్నారు.

ప్రాయశ్చిత్త శ్లోకాలట..

ఎక్కడా లేని ప్రాయశ్చిత్త శ్లోకాలను తెర మీదికి తెచ్చారని, వాటిని వాళ్లే వల్లె వేయించారని విమర్శించారు. తిరుమల లడ్డూపై వీళ్లందరూ మామూలు రచ్చ చేయలేదని సెటైర్లు వేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, కనీసం దేవుళ్లనయినా రాజకీయాలకు దూరంగా పెట్టాలంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్లందరూ ఏం చేస్తారని శ్రీవాణి నిలదీశారు.

నిజంగా శ్రీవారి భక్తులే అయితే..

మీరు నిజంగా హిందువులే అయితే, నిజంగా వేంకటేశ్వరస్వామి భక్తులే అయితే తిరుమల లడ్డూపై మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ చేసిన నోటీతోనే క్షమించండి అని పోస్టులు పెట్టగలరా? అని ప్రశ్నించారు. ఎంత మంది ఇలా పోస్టులు పెడతారో చూస్తానని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+