చంద్రబాబుపై ఆ రకంగా ఒత్తిడి
Tirumala Laddu row: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై చెలరేగిన వివాదం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ వివాదం మొదటికే వస్తోంది.
తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, దీనిపై దర్యాప్తును సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అప్పగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేశారు. అప్పుడే నిష్పక్షపాతంగా విచారణ సాగుతుందని, అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ తేల్చి చెబుతున్నారు.

చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం సిట్‌తో సరిపెట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సారథ్యం వహిస్తారని గతంలోనే ప్రకటించింది. మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వీ హర్షవర్ధన్ రాజును ఇందులో నియమించింది.
తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్ రావు, డిప్యూటీ ఎస్పీలు జీ సీతారామ రావు, జే శివనారాయణ స్వామి, అన్నమయ్య రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ టీ సత్యనారాయణ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ కే ఉమా మహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఎం సూర్యనారాయణను ఇందులో చేర్చింది.
సిట్ దర్యాప్తు మొదలు పెట్టినప్పటికీ- సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలనే డిమాండ్‌కు తెరపడట్లేదు. ఇదే డిమాండ్‌పై తాజాగా విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి దిగింది. తిరుపతిలో ఈ సాయంత్రం నిరసన ప్రదర్శనను నిర్వహించబోతోంది. ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలనే ప్రధాన డిమాండ్‌తో వీహెచ్‌పీ తిరుపతి జిల్లా విభాగం దీన్ని తలపెట్టింది. హిందువుల పుణ్యక్షేత్రాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండకూడదని, దీనికి సంబంధించిన చట్టాన్ని ఏ ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదంటూ వీహెచ్‌పీ ఆరోపించింది.
ఇప్పటికైనా హిందూ ఆలయాల్లో విధుల్లో ఉన్న అన్యమత ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేసింది. దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని, దీన్ని ధార్మిక పరిషత్‌కు అప్పగించాలని, ధార్మిక పరిషత్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని, అవసరమైతే దీనికోసం ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టాలని పేర్కొంది.
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
క్యూలైన్ నిర్వహణలో ఇకపై.. -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications