TTD: శ్రీవారి ఆలయంలో అపశ్రుతి - భక్తుల ఆందోళన..!!

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. భక్తులు శ్రీవారి హుండీని పరిమ పవిత్రంగా భావిస్తారు. తమ మొక్కులను హుండీ ద్వారా తీర్చుకుంటారు. అలాంటి హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన చెందారు. హుండీలో నుంచి కానుకలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తిరిగి హుండీని జాగ్రత్తగా లారీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరకామణికి తరలించారు.

ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కచ్చితంగా శ్రీవారికి కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. అవి డబ్బు రూపంలో గానీ, బంగారం రూపంలో గానీ భక్తులు కానులు సమర్పిస్తారు. శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. కానుకలు సమర్పించడాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన చెందారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడి పోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ttd

శ్రీవారి హుండీ నిండిన ప్రతీ సందర్భంలోనూ ప్రత్యేక సిబ్బంది ట్రాలీ ద్వారా పరకామణికి తరలిస్తారు. కొత్తగా నిర్మించిన పరాకమణిలో లెక్కింపు చేపడుతారు. నిత్యం ఈ విధానం కొనసాగుతోంది. ఈ రోజు చోటు చేసుకున్న ఘటన పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం..కానుకల చెల్లింపు..హుండీ.. ప్రసాదం అన్నింటినీ భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు మహాద్వారం వద్ద ఈ విధంగా హుండీ కింద పడటం..కానుకలు చెల్లాచెదురుగా పడటం వెనుక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కారణమనే అభిప్రాయలు వినిపిస్తన్నాయి. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సిబ్బంది తీరు విమర్శలకు కారణమవుతోంది.

మరోవైపు నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని 77,299 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 30,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+